Manchu Manoj: హనుమంతు అమ్మతోడు..నిన్ను వదిలిపెట్టను..మంచు మనోజ్ స్ట్రాంగ్ వార్నింగ్

ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న దారుణాలపై పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని టాలీవుడ్ యంగ్ హీరో సాయిథరమ్ తేజ్ సూచించిన విషయం తెలిసిందే.  చిన్నపిల్లల ఫోటోలు,వీడియోలు పోస్ట్  చేయొద్దని కోరారు. కొంతమంది యూట్యూబర్స్..తండ్రి, కూతురి వీడియోను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారు. దీనికి సంబంధించి కామెంట్స్ ను ఉద్దేశిస్తూ సాయిథరమ్ తేజ్ ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని  ఏపీ,తెలంగాణ సీఎంలతో పాటు..డిప్యూటీ సీఎంలను, డీజీపీలకు, పోలీసులకు విజ్ఞప్తి చేశారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి నుండి టాలీవుడ్ హీరోలు కూడా ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. తాజాగా హీరో మంచు మనోజ్‌ (Manchu Manoj) తనదైన శైలిలో స్పందించారు. 

"చిన్నపిల్లలపై అసభ్యకరమైన కామెంట్స్‌ చేసేవారు సమాజానికి ఎంతో ప్రమాదమని మంచు మనోజ్‌ అన్నారు. పిల్లల భద్రత విషయంలో ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ట్విట్టర్ ఎక్స్‌ వేదికగా ఘాటుగా స్పందిస్తూ పిల్లలపై అసభ్య కామెంట్స్‌ చేసిన ఓ వ్యక్తికి స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చారు. 

‘చిన్న పిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ నీచంగా వీడియోలు చేసే వారిని చూస్తే భయంతోపాటు అసహ్యమేస్తోంది. హాస్యం ముసుగులో సోషల్‌ మీడియాలో ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇలాంటి ప్రవర్తన సమాజానికి చాలా ప్రమాదకరమైంది. ఒక సంవత్సరం క్రితం,నేను AP మరియు తెలంగాణలో అఘాయిత్యాలను ఎదుర్కొంటున్న మహిళలు,పిల్లలకు మద్దతు ఇవ్వడానికి ఇన్‌స్టా ద్వారా అతనిని సంప్రదించాను.కానీ,అప్పుడు అతడి నుంచి ఎలాంటి స్పందన లేదు.ఈ రోజు అదే వ్యక్తి సోషల్‌ మీడియాలో పిల్లలపై ఇంతటి నీచమైన కామెంట్స్‌ చేస్తున్నాడు.

Also Read:సరిపోదా శనివారం చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్

పిల్లలు, మహిళల రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమివ్వాలి.దయచేసి ఇటువంటి భయంకరమైన ప్రవర్తనపై తక్షణమే,నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు రాష్ట్రాల సీఎంలు,అమెరికాలోని ఇండియన్‌ ఎంబసీ అధికారులను విజ్ఞప్తి చేశారు. అలాగే ఒక వ్యక్తిని ఉద్దేశిస్తూ ‘పి హనుమంతు..అమ్మతోడు..నిన్ను వదిలిపెట్టను’ అని వార్నింగ్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.సమాజంలో జరిగే ప్రతి అన్యాయాన్ని తనదైన శైలిలో మంచు మనోజ్ వ్యక్త పరుస్తుంటాడు.