నా తల్లి మీద ఒట్టు.. విష్ణు కెరీర్ కోసం నన్ను వాడుకున్నరు: మనోజ్ ఎమోషనల్

నా తల్లి మీద ఒట్టు.. విష్ణు కెరీర్ కోసం నన్ను వాడుకున్నరు: మనోజ్ ఎమోషనల్

హైదరాబాద్: జల్‎పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. బుధవారం (ఏప్రిల్ 9) హీరో మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబు ఇంటికి కుటుంబంతో సహా వచ్చాడు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు వద్దే పోలీసులు, మోహన్ బాబు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు తన దగ్గర కోర్టు ఆర్డర్స్ ఉన్నాయని మనోజ్ వారితో వాగ్వాదానికి దిగాడు. అయినప్పటికీ ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతించకపోవడంతో ఇంటి గేటు ముందు బైఠాయించాడు. 

ఈ సందర్భంగా మనోజ్ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. నా ఇంట్లోకి నన్ను వెళ్లనివ్వండని ఎమోషనల్ అయ్యాడు. కోర్టు ఆర్డర్ ఉన్నా నన్ను ఇంట్లోకి వెళ్లనివ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తప్పుడు సంతకాలతో కోర్టులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇంట్లో మావి మూడు పెట్స్ (కుక్క పిల్లలు) ఉన్నాయి.. అవి ఇవ్వమని మాత్రమే అడుగుతున్నానని అన్నాడు. 

నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా.. ఏ రోజు నేను ఆస్తి కోసం కొట్లాట చేయలేదన్నారు. నేనంటే మా అన్న విష్ణుకి కుల్లు.. మా అన్న కెరీర్ కోసం నన్ను వాడుకున్నారని భావోద్వేగానికి గురయ్యాడు. మా నాన్న కోరిక మేరకు మా అన్న కోసం ఆయన సినిమాలో ఆడ వేశం కూడా వేశానని గుర్తు చేశారు. గత కొన్ని రోజులుగా సైలెంట్‎గా ఉన్న మంచు ఫ్యామిలీ వార్ మరోసారి మీడియాలో హాట్ టాపిక్‎గా మారింది.