టాలెంటెడ్ హీరో మంచు మనోజ్(Manchu manoj) తన భార్య మౌనిక(Mounika) పుట్టినరోజు సందర్బంగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇటీవలే ఈ జంట పెళ్లి బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. పెళ్ళైన తరువాత మొదటిసారి వచ్చిన పుట్టినరోజు కావడంతో మనోజ్ ఈ రోజును చాలా స్పెషల్ డేగా అభివర్ణించారు.
ALSO READ : దేన్నీ వదల్లేదు : G20 సమ్మిట్ పూల కుండీలు, వస్తువులు ఎత్తుకెళుతున్న జనం
ఈమేరకు తన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.. ప్రియమైన మున్నిలు(మౌనిక).. ఇవాళ నీ పుట్టినరోజు సందర్భంగా నాకు నీపై ఉన్న ప్రేమను, ఇష్టాన్ని తెలియజేయాలనుకుంటున్నా. నా జీవితంలో ప్రేమ వెలుగులు పంచింది నువ్వే, మనల్ని ఒకటి చేసిన ఈ కాలానికి నేనెప్పటికీ రుణపడి ఉంటాను. మా జీవితాల్లోకి వెలకట్టలేనంత సంతోషాన్ని తీసుకొచ్చావు, నవ్వుల్ని పంచావు. నీ ప్రేమ, నీ కేరింగ్ మాటల్లో చెప్పలేను.
నీ మనసెంత మంచిదంటే.. నీ చుట్టూ ఉన్నవాళ్ళకి నిస్వార్థమైన ప్రేమను పంచుతావు. నా కోరిక ఒక్కటే.. ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలి. నీకెప్పుడూ మంచే జరగాలి మై లవ్. దానికోసం నేను ఏదైనా చేస్తాను.. ఎంత దూరమైనా వెళ్తాను. నీ పుట్టినరోజు సందర్బంగా మనం కలిసున్న మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నాను మున్నిలు. హ్యాపీ బర్త్‌డే మై డార్లింగ్ వైఫ్. ధైరవ్, జోయా తోపాటు నా తరపునుంచి నీకు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు.. అని రాసుకొచ్చారు. ప్రస్తుతం మనోజ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన మనోజ్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికదా మౌనికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.