మంచు మనోజ్ కు కరోనా

మంచు మనోజ్ కు కరోనా

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ కు కరోనా బారిన పడ్డారు.తనకు  కరోనా సోకినట్లు మనోజ్ తెలిపాడు. తనకు కోవిడ్‌ పాజిటివ్ వచ్చింది అంటూ స్వయంగా హీరో మంచు మనోజ్.. సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టాడు. గత వారంలో తనను కలిసిన ప్రతి ఒక్కరూ వెంటనే టెస్టులు చేయించుకోవాలని కోరాడు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నాడు.  డాక్టర్ల పర్యవేక్షణలో తాను క్షేమంగా ఉన్నానని... ఎవరూ కూడా ఆందోళన పడొద్దని మంచు మనోజ్ తన అభిమానుల్ని కోరాడు. మరోవైపు తెలంగాణలో కరోనా కేసులతో పాటు.. ఒమిక్రాన్ కేసులు కూడా కలకలం రేపుతున్నాయి. తాజాగా మంగళవారం రోజు మరో 7 ఒమిక్రాన్ కేసులు  నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 62కి చేరిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 62 మంది ఒమిక్రాన్‌ బాధితుల్లో 46 మంది టీకా తీసుకోలేదని మంత్రి వెల్లడించారు. 

మరోవైపు దేశ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజే 9 వేల 195 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దేశంలో కేసులు బాగా తగ్గినట్టుగా అందరూ భావిస్తోన్న సమయంలో ఇన్ని కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క వారం రోజుల్లోనే 70శాతం కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా మరణాల సంఖ్య కూడా పెరిగింది. 24గంటల్లో కరోనాతో 302మంది చనిపోయారు.

ఇవి కూడా చదవండి:

వద్దన్నా వేశారు..అమ్మ ప్రాణం తీశారు

సెకండ్ వేవ్ ముందు కంటే పెరిగిన టూర్​ ప్లానింగ్స్