హీరో మోటోకార్స్ భారత మార్కెట్ లో హీరో జూమ్ 110 పేరిట సరికొత్త స్కూటర్ ని సోమవారం లాంచ్ (జనవరి 30) చేసింది. ఎల్ ఎక్స్, వీఎక్స్, జెడ్ ఎక్స్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ ధర రూ.68,599 (ఎక్స్ షోరూమ్)తో లభిస్తుంది. జెడ్ ఎక్స్ వేరియంట్ ధర రూ.76,699 (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. ఈ 110సీసీ స్కూటర్ టీవీఎస్ జూపిటర్, హోండా యాక్టివా స్మార్ట్ స్కూటర్లతో పోటీ పడనుంది.
హీరో మాస్ట్రోతో పోలిస్తే ఇందులో మరిన్ని ఫీచర్స్, అప్ డేట్స్ ఉన్నాయి. జూమ్ లో 110 సీసీ ఇంజన్ ను అమర్చారు. డిజిటల్ డిస్ ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, 12 ఇంచుల అలాయ్ వీల్స్, టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఆరెంజ్, బ్లాక్, రెడ్, వైట్, బ్లూ కలర్స్ లో రానున్నాయి. ఫిబ్రవరి నుంచి ఈ స్కూటర్ బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి.