
న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్ త్రీవీలర్ల సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఎలక్ట్రిక్ ఆటోలను తయారు చేసే యూలర్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.525 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేస్తామని తాజాగా ప్రకటించింది. దశల వారీగా ఈ పెట్టుబడులు పెట్టనుంది. యూలర్‌లో 32.5 శాతం వాటాను హీరో దక్కించుకుంటుంది. ఇప్పటికే షేర్‌హోల్డర్లుగా ఉన్న వారి నుంచి కూడా వాటాలు కొనేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇండియాలోని 30 సిటీలలో యూలర్ మోటార్స్ బండ్లు అమ్ముడవుతున్నాయి.