న్యూఢిల్లీ: హీరో మోటార్స్ కంపెనీ (హెచ్‌ఎంసీ) గ్రూప్‌కు చెందిన ఆటో కాంపోనెంట్ల తయారీ కంపెనీ హీరో మోటార్స్ లిమిటెడ్ ఐపీఓ ద్వారా రూ.900 కోట్లు సేకరించాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ పేపర్లను సెబీ వద్ద ఫైల్ చేసింది. ఫ్రెష్‌గా షేర్లను ఇష్యూ చేయడం ద్వారా రూ.500 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) కింద మరో రూ.400 కోట్లను కంపెనీ సేకరించనుంది. ఓఎఫ్‌ఎస్ కింద ఓపీ ముంజాల్ హోల్డింగ్స్ రూ.250 కోట్ల విలువైన షేర్లను అమ్మనుంది. 2023–24 లో ఈ కంపెనీకి రూ.1,064.4 కోట్ల రెవెన్యూ వచ్చింది.
ఐపీఓ పేపర్లు సబ్మిట్ చేసిన కర్రారో
అగ్రికల్చరల్, కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ల కోసం ట్రాన్స్‌మిషన్ సిస్టమ్స్‌ను తయారు చేసే కర్రారో ఇండియా లిమిటెడ్ ఐపీఓకి వచ్చేందుకు సెబీ దగ్గర ప్రిలిమినరీ పేపర్లను సబ్మిట్ చేసింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.1,812 కోట్లను సేకరించాలని చూస్తోంది. 2023-–24 లో రూ.1,770.45 కోట్ల రెవెన్యూ, రూ.60.58 కోట్ల నికర లాభం సాధించింది.
ఏరాన్ ఐపీఓ ఈ నెల 28న ఓపెన్
ఫైబర్‌గ్లాస్ రీఇన్‌ఫోర్స్డ్ పాలిమర్ (ఎఫ్‌ఆర్‌పీ) ప్రొడక్ట్‌లను తయారు చేసే ఏరాన్ కాంపోజిట్‌తన ఐపీఓ ప్రైస్ బ్యాండ్‌ను ప్రకటించింది. ఒక్కో షేరుని రూ.121–125 రేంజ్‌లో అమ్మనుంది. ఈ ఎస్‌ఎంఈ ఐపీఓ ఆగస్ట్ 28 న ఓపెనై 30 న ముగుస్తుంది. కనీసం వెయ్యి షేర్ల కోసం బిడ్ వేయాలి.