KA Movie: గ్రాండ్గా 'క' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్గా అక్కినేని హీరో

KA Movie: గ్రాండ్గా 'క' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్గా అక్కినేని హీరో

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) విభిన్నంగా సింగిల్ లెటర్ 'క'(KA)టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో కిరణ్ సరసన నయన్ సారిక, తన్వీ రామ్ నటించారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన కాన్సెప్ట్ టీజర్, వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ సాంగ్‌కు ఆడియన్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. పీరియాడిక్ థ్రిల్లర్ మూవీగా వస్తోన్న 'క' సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలోకి రాబోతోంది.

ఈ నేపథ్యంలో మేకర్స్ 'క'(KA) మూవీ ప్రమోషన్స్ లో వేగం పెంచారు. నేడు మంగళవారం అక్టోబర్ 29న గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ వేడుకకు యువసామ్రాట్ అక్కినేని హీరో నాగ చైతన్య ముఖ్య అతిధిగా రానున్నారు. అక్టోబర్ 29 సాయంత్రం 6 గంటలకు ది వెస్టిన్, హైదరాబాద్ లో జరగనుందని తెలిపారు. 

పీరియాడికల్ కథతో వస్తున్న ఈ సినిమాకు మేకర్స్ రూ.20కోట్ల బడ్జెట్ ఖర్చు చేసారు. కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో వస్తోన్న మూవీ ఇదే కావడం విశేషం. శ్రీచక్ర ఎంటర్ టైన్ మెంట్స్, కిరణ్ అబ్బవరం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సుజీత్‌, సందీప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీతోనే వీరిద్ద‌రు డైరెక్ట‌ర్లుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నారు.