అక్కినేనివారి హీరో నాగ చైతన్య(Naga Chaitanya) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన నటించిన మొదటి వెబ్ సిరీస్ దూత(Dhootha) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టార్ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్(Vikram K kumar) తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సిరీస్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. దీంతో దూత సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు నాగ చైతన్య.
ఇందులో భాగంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ తన తాతయ్య నాగేశ్వర రావు ఆయనకు చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. ఆయన చిన్నప్పుడు ఏదైతే చెప్పారో నా విషయంలో అదే జరిగింది అని చెప్పుకొచ్చారు. ఈ విషయం గురించి చై మాట్లాడుతూ.. నా చిన్నప్పుడు మా తాతయ్య(నాగేశ్వరరావు) చెప్పిన మాటలే ఇప్పుడు నిజమయ్యాయి. ఆయన ఒకేసారి నన్ను పెద్దయ్యాక ఏమవుతావని అడిగారు.. దానికి నేను ఇంజినీర్ అవుతానని చెప్పను కానీ.. తాతయ్య మాత్రం.. నువ్వు కూడా నాలాగే నటుడు అవుతాడని చెప్పేవారు. ఆయన చెప్పినట్టుగానే నేను నటుడిని అయ్యాను.. అని చెప్పుకొచ్చాడు నాగచైతన్య. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా చేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.