వండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాలో కొత్త రైడ్స్​

వండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాలో కొత్త రైడ్స్​

హైదరాబాద్, వెలుగు : అమ్యూజ్మెంట్ పార్క్ చైన్​ వండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా హాలిడేస్ లిమిటెడ్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్​లో  హైపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్స్, జీ-ఫాల్ ను ఆవిష్కరించింది.  ఈ రైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను సినీ నటుడు నాగ చైతన్య ప్రారంభించారు. జీ-ఫాల్ ఒక ఎత్తైన ఫ్రీ-ఫాల్ రైడ్. ఇది40 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇందులో 12 మంది కూర్చోవచ్చు. హైపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్స్..అత్యాధునిక మెటావర్స్ 3డీ థియేటర్ అనుభవాన్ని అందిస్తుంది. 

ఐదు నిమిషాలపాటు అద్భుత వీక్షణ అనుభూతిని అందిస్తుంది. సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 30 మందికి పైగా చూడొచ్చు. 8కే హై-రిజల్యూషన్ డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే, 360 డిగ్రీ సరౌండ్ సౌండ్,  270 డిగ్రీ లైట్,  షాడో డిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీని ప్రత్యేకతలు.  అద్భుతమైన 3డీ విజువల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రేక్షకులు సరికొత్త అనుభూతికి లోనవుతారని వండర్​లా తెలిపింది.  

నాగ చైతన్య మాట్లాడుతూ ఈ అద్భుతమైన ఆకర్షణలను వండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రారంభించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. గ్లోబల్ పార్కులతో సమానంగా వండర్​లా రైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తీసుకువస్తోందని ప్రశంసించారు.