Naga Chaitanya- Sobhita Dhulipala: ఇవాళే నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్! నాగార్జున క్లారిటీ ?

Naga Chaitanya- Sobhita Dhulipala: ఇవాళే నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్! నాగార్జున క్లారిటీ ?

అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) రెండో పెళ్లి గురించి గత కొన్నిరోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆయన హీరోయిన్ శోభిత(Shobhita)తో రిలేషనల్ లో ఉన్నారని, త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి. విదేశాల్లో వీరికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరి మధ్య ఎదో నడుస్తుందని అనుకున్నారంతా. కానీ, అటు నాగ చైతన్య నుండి కానీ, ఇటు శోభితా నుండి కానీ ఈ వార్తలపై ఎలాంటి స్పందన రాలేదు. 

అయితే, తాజా సమాచారం ప్రకారం హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ ఇవాళ (ఆగస్ట్ 8న) ఎంగేజ్‌మెంట్ చేసుకోనున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని హీరో నాగార్జునే అధికారికంగా ప్రకటించనున్నారనే వార్తలు సినీ సర్కిల్ లో హల్‌చల్ చేస్తున్నాయి.

ఈ ఎంగేజ్‌మెంట్ వేడుక కేవలం కుటుంబ సభ్యుల మధ్యే నాగార్జున ఇంట్లోనే జరుగుతుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ..ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో వస్తోన్న వార్తలపై అక్కినేని ఫ్యామిలీ మరికొన్ని గంటల్లో స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన తండేల్ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. 

శోభితా ధూళిపాళ ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలికి చెందిన అమ్మాయి. ఆమె ముంబై యూనివర్సిటీ, హెచ్‌ఆర్‌ కాలేజీలో కామర్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌ పూర్తిచేసింది. 2013లో మిస్‌ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకున్నది. ఇక అడవిశేష్ నటించిన గూఢచారి సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మేజర్, పొన్నియన్ సెల్వన్,కురుప్ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్ వంటి వెబ్ సిరీసుల్లో సూపర్ హాట్ షో చేసి బోల్డ్ హీరోయిన్ అనిపించుకుంది శోభితా ధూళిపాళ.