తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajijnikanth) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ(Coolie). స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్(Loeksh kangaraj) తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా మొదలయింది. తాజాగా ఈ సినిమాను టైటిల్ ప్రకటిస్తూ వీడియో విడుదల చేసిన విషయం తెలిసందే. కూలీ టైటిల్ తో వచ్చిన ఈ వీడియో ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలుకాకముందే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.
తాజాగా ఆ అంచనాలను మరింత పెంచేసి న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాలో టాలీవడ్ కింగ్ నాగార్జున ఓ కీ రోల్ లో కనిపించనున్నాడట. అవును.. లోకేష్ ఈ సినిమాలో నాగార్జున కోసం ఓ మాసీ క్యారెక్టర్ ను డిజైన్ చేశారట. ఈ పాత్ర గురించి నాగార్జునకు వివరించగా ఆయన కూడా వెంటనే ఒకే చెప్పేశారని టాక్. త్వరలోనే ఈ విషయంపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్స్ నెక్స్ట్ లెవల్లో రియాక్ట్ అవుతున్నారు. కూలీకి సపోర్ట్ గా వస్తున్నా కింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక రజినీకాంత్, నాగార్జున సినిమాల విషయానికి వస్తే.. రజినీకాంత్ ప్రస్తుతం వెట్టయ్యన్ సినిమా చేస్తున్నారు. జై భీమ్ సినిమా టీజీ జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నాగార్జున విషయానికి వస్తే.. ప్రస్తుతం అయన దర్శకుడు శేఖర్ కమ్ములతో కుబేర సినిమా చేస్తున్నారు. తమిళ స్టార్ ధనుష్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. నాగార్జున ఈ సినిమా కీ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.