హైదరాబాద్ మాదాపూర్‌లోని హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. తుమ్మిడి కుంట పరిధిలో మూడున్నర ఎకరాల భూమి ఆక్రమించి నిర్మించారన్న ఫిర్యాదుల మేరకు హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్‌ను నేలమట్టం చేశారు. ఈ క్రమంలో ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై ఎక్స్ (ట్టిట్వర్) వేదికగా హీరో నాగార్జున మరోసారి స్పందించారు. ఈ సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషలకు కీలక విజ్జప్తి చేశారు నాగ్. ‘‘ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ.. N -కన్వెన్షన్‌కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి. కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్టు, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ (ప్రొహిబిషన్) యాక్ట్, 24-02-2014న ఒక ఆర్డర్ Sr 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం, నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం గౌరవ హైకోర్టుని ఆశ్రయించటం జరిగింది. న్యాయస్థానం తీర్పుకి నేను కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్ధిస్తున్నాను’’ అని నాగార్జున విజ్ఞప్తి చేశారు.
కాగా, తుమ్మిడి కుంట చెరువు పరిసరాల్లో మొత్తం 10 ఎకరాల విస్తీరణంలో హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించారు. ఈ ఎన్ కన్వెన్షన్ సెలబెట్రీల పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఇతర సినిమా ఈవెంట్లకు కేరాఫ్ అడ్రస్.. ఇక్కడి వరకు బాగానే ఉన్న ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మాణంపై మొదటి నుండి వివాదస్పదమే. 26 ఎకరాల్లో ఉన్న తుమ్మిడి కుంటలో మూడున్నర ఎకరాలు ఆక్రమించి నాగార్జున ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మించారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై కోర్టులో కేసు సైతం నడుస్తోంది. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా.. ఎన్ కన్వెన్షన్ నిర్మాణంపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి.. ఆగస్ట్ 24వ తేదీన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేసింది. హైడ్రా ఎన్ కన్వెన్షన్ ను నేల మట్టం చేయడాన్ని సవాల్ చేస్తూ హీరో నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దీంతో కోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ,
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 25, 2024
N-కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి . కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు…