జగన్‌తో సమావేశానికి నేను రానన్నా

ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్‌తో సినీ హీరోల భేటీపై ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. టికెట్ రేట్స్ గురించి జగన్‌తో సమావేశానికి తనను ఆహ్వానించారన్నారు. కానీ.. ఆ సమావేశానికి తాను రానని చెప్పానన్నారు బాలయ్య. ఎందుకంటే తాను రెమ్యునరేషన్ పెంచనన్నారు. తన సినిమా బడ్జెట్‌ను పెంచనన్నారు. బడ్జెట్ పెంచి నిర్మాతను ఇబ్బంది పెట్టనని తెలిపారు బాలకృష్ణ. టికెట్ రేట్స్ మీద అంతకముందే తాను కొన్ని సూచనలు చేశానన్నారు బాలయ్య బాబు. బడ్జెట్ గురించి కూడా ఆలోచించాలని చెప్పానన్నారు. తక్కువ టిక్కెట్ ధరలతో అఖండ పెద్ద బ్లాక్‌బస్టర్‌ అయిందన్నారు. రాజకీయంగా అయితే హిందూపురం కోసం  జగన్ ని కలుస్తా... కానీ టికెట్స్ రేట్స్ మీద అయితే కలవను అని చెప్పారు బాలకృష్ణ. 

ఇక ఇటీవలే టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోలు జగన్‌ను కలిసిన విషయం తెలిసిందే. చిరంజీవి, ప్రభాస్, మహేశ్, అలీ, నటుడు ఆర్ నారాయణ మూర్తి, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. అనేక సినీ సమస్యలపై చర్చించారు. మరోవైపు ఇవాళ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ముఖ్యమంత్రిని కలిశారు. 

ఇవి కూడా చదవండి:

సీఎం జగన్‌ను కలవనున్న మంచు విష్ణు

సీఎం కేసీఆర్ పై ఫిర్యాదు!