
నాని హీరోగా వస్తున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మే1న సినిమా విడుదల కానుంది. సోమవారం ఉదయం వైజాగ్‌లో ట్రైలర్ లాంచ్ చేసిన మేకర్స్.. సాయంత్రం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. హీరో నాని మాట్లాడుతూ ‘ఇదొక రేసీ థ్రిల్లర్. శైలేష్ చాలా కొత్తగా సినిమాని డీల్ చేశాడు. యాక్షన్ సినిమాలని ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు ఫుల్ మీల్స్.
స్ట్రాంగ్ కంటెంట్‌తో పాటు ఒక కొత్త థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఇందులో వైలెన్స్ చూస్తున్నప్పుడు పూనకం వస్తుంది. అందుకు కారణం ఆ సీన్స్‌లో ఎమోషన్ బలంగా ఉండటమే’ అని చెప్పాడు. దర్శకుడు శైలేష్ మాట్లాడుతూ ‘ఇది చాలా డిఫరెంట్ జానర్ మూవీ. యాక్షన్ కొరియోగ్రఫీకి ప్రాధాన్యత ఎక్కువ.
లీ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. స్క్రీన్‌పై కొత్తగా ఉంటూ యూనిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఇందులో చక్కని మెసేజ్ కూడా ఉంది. ధర్మం కోసం నిలబడ్డ మనిషి ఎంత దూరం వెళ్ళాడనేది ఇందులో చూస్తారు’ అని చెప్పాడు. ఇంకా ఈ కార్యక్రమంలో డిఓపి సాను జాన్ వర్గీస్, ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర పాల్గొన్నారు.