ఎమోషన్ ఉన్న హారర్ సినిమా శబ్దం

ఎమోషన్ ఉన్న హారర్ సినిమా శబ్దం

ఆది పినిశెట్టి హీరోగా నటించిన తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీ ‘శబ్దం’.  అరివళగన్‌‌‌‌ దర్శకుడు.  ‘వైశాలి’ తర్వాత వీరిద్దరి కాంబోలో రూపొందిన రెండో చిత్రమిది.  7జీ ఫిల్మ్స్ శివ నిర్మించారు. ఫిబ్రవరి 28న   సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌కు గెస్ట్‌‌‌‌గా హాజరైన నాని మాట్లాడుతూ ‘ఈ సినిమా చూశా. ఇందులో సర్‌‌‌‌‌‌‌‌ప్రైజింగ్ విషయాలు చాలా ఉన్నాయి.  చాలా గ్రిప్పింగ్​గా తీశారు. 

మంచి కథ, ఎమోషన్ ఉన్న హారర్ సినిమా ఇది’ అని టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ ‘నా కెరీర్ స్పెషల్ మూవీ ‘వైశాలి’  లేకపోతే ‘శబ్దం’ ఉండేది కాదు. ఈ జర్నీ 16 ఏళ్ల క్రితం మొదలైంది. ‘శబ్దం’ కూడా స్పెషల్ మూవీ అవుతుందని కోరుకుంటున్నా’ అని అన్నాడు.  మంచి థియేటర్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్ ఉన్న సినిమా ఇదని దర్శకుడు అరివళగన్‌‌‌‌ అన్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, ఎన్ సినిమాస్ డిస్ట్రిబ్యూటర్స్ హనుమంత్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి సహా టీమ్ అంతా పాల్గొన్నారు.