
టైటిల్ చూడగానే అదేంటీ.. సీరియల్ హీరోయిన్ తో హీరో నాని ఆటోగ్రాఫ్ తీసుకోవడమేంటి.. అనుకుంటున్నారా.? అక్కడికే వస్తున్నా.. అయితే ఇటీవలే ప్రముఖ మసాలా తయారీ సంస్థ ఐటీసీ ఆశీర్వాద్ కారం ప్రాడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ ఓ యాడ్ ని చిత్రీకరించారు. ఈ యాడ్ లో బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ దీపికా రంగరాజు, నాని కలసి నటించారు.
Also Read:-‘X’ లోకి సమంత రీ ఎంట్రీ..
ఇందులో హీరో నాని నీ వంటలో దమ్ముంది అమ్మ.. అని అంటాడు... నా వంటల్లో మీలాగే దమ్మున్న ఆశీర్వాద్ కారం ని ఉపయోగిస్తున్నాను అన్న.. అని చెబుతుంది.. ఇక భోజనం చేసాక దీపిక హీరో నాని ని ఆటోగ్రాఫ్ ఇవ్వాలని అడుగుతుంది. కానీ నాని మాత్రం దమ్మున్న వంటలతో ఫ్యామిలీని మెప్పిస్తావు. నువ్వే దమ్మున్న స్టార్... నీ ఆటోగ్రాఫ్ ఇవ్వు అని అడుగుతాడు. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం హీరో నాని తెలుగులో హిట్ 3: ది థర్డ్ కేస్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నానికి జోడిగా కన్నడ హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఈ సినిమాకి టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్, ప్రొడ్యూసర్ ప్రశాంతి తిపిర్నేని, హీరో నాని కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా మే 1న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది.