నానీ దసరా హిట్ కాంబో మళ్ళీ రిపీట్..

నానీ దసరా హిట్ కాంబో మళ్ళీ రిపీట్..

టాలీవుడ్ ప్రముఖ హీరో నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం చిత్రంతో హిట్ ట్రాక్ కంటిన్యూ చేస్తున్నాడు. అలాగే ఈ మధ్య కథల విషయంలో కూడా రూట్ మర్చినట్లు తెలుస్తోంది. అయితే గతంలో తనకి దసరా చిత్రంతో బిగ్ హిట్ ఇచ్చిన నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో రెండో చిత్రాన్ని చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ చిత్రాన్ని లాంచ్ చేశారు.

గతంలో సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ స్టోరీ తో హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల ఈసారి నాని కోసం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా స్ట్రాంగ్ ఎమోషన్స్‌ స్క్రిప్ట్ ని రెడీ చేసినట్లు తెలుస్తోంది.  స్ట్రాంగ్ నేరేషన్, టేకింగ్, స్క్రీన్ ప్లే వంటి విషయాలలో శ్రీకాంత్ ఓదెల పర్ఫెక్ట్ గా ఉండటంతో దసరా చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఫుల్ డెటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం హీరో నాని తెలుగులో హిట్ : ది థర్డ్ కేస్ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నాని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి తెలుగు ప్రముఖ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. హిట్ 3 చిత్రం షూటింగ్ పూర్తీ చేసుకుని రిలీజ్ కి సిద్దంగా ఉంది. దీంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.