జానీ మాస్టర్ కేసుతో మా సినిమాకి ఎలాంటి సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చిన హీరో నాని..

జానీ మాస్టర్ కేసుతో మా సినిమాకి ఎలాంటి సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చిన హీరో నాని..

టాలీవుడ్ ప్రముఖ హీరో, కమెడియన్ ప్రియదర్శి నటిస్తున్న లేటెస్ట్ సినిమా "కోర్ట్: స్టేట్ వెర్సెస్ ఏ నోబడీ". ఈ సినిమాకి నూతన డైరెక్టర్ రామ్ జగదీశ్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ హీరో నేచురల్ స్టార్ నాని నిర్మించాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, హర్ష వర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, రాజశేఖర్ అనింగి, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ఈ సినిమా మార్చ్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో ఇటీవలే ఈ చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా కొందరు విలేఖర్లు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు.

అయితే ఓ విలేఖరి ఈ సినిమా మొత్తం పోక్సో చట్టం బ్యాక్ డ్రాప్ లో కాబట్టి ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ జానీతో ఏదైనా సంబంధం ఉందా.? ఇటీవలే జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ని ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారా అని అడిగారు. దీంతో హీరో నాని స్పందిస్తూ ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ జానీతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. అలాగే జానీ లైఫ్ లో జరిగిన విషయాలకి ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదని కూడా క్లారిటీ ఇచ్చాడు.

ALSO READ | మరో బ్లాక్ బస్టర్ హిట్ ని మిస్ చేసుకున్న మహేష్.. చేసుంటే రూ.1000 కోట్లు పక్కా అంటున్న ఫ్యాన్స్..

ఇక మైనర్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీస్తున్నారు కాబట్టి ఏదైనా లీగల్ గా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ముందే అన్నీ చెక్ చేసుకున్నారా అని అడిగారు. దీంతో నాని మాట్లాడుతూ ఈ సినిమా మైనర్స్ పోక్సో రిలేటెడ్ బ్యాక్ ద్రప లో తీసినప్పటికీ సెన్సార్ నిబంధనలకు అనుగుణంగా తీశామని త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తామని అప్పుడు అందరికీ క్లారిటీ వస్తుందని తెలిపాడు. ఇక బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని తెరకెక్కించామని ఆడియన్స్ కి నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశాడు.