అలా అయితే నా సినిమా చూడొద్దు : హీరో నాని తెగేసి చెప్పేశారు

అలా అయితే నా సినిమా చూడొద్దు : హీరో నాని తెగేసి చెప్పేశారు

Nani: టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని సమర్పణలో నూతన డైరెక్టర్ రామ్ జగదీష్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ సినిమా  ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ఈ పోక్సో యాక్ట్ గురించి అవగాహన కల్పిస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలో తెలుగు ప్రముఖ హీరో, కమెడియన్ ప్రియదర్శి లాయర్ పాత్రలో నటిస్తుండగా బిగ్ బాస్ కంటెస్టెంట్, వెటరన్ హీరో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రలో నటించారు. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహించారు. 

ఇందులోభాగంగా హీరో నాని మాట్లాడుతూ పలు ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఈ సినిమా పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. కాబట్టి ప్రతీ ఒక్కరూ తప్పకుండా మార్చి 14 న థియేటర్స్ కి వెళ్ళి చూడాలని కోరాడు. అయితే తాను ఈ సినిమా ప్రొడ్యూసర్ గా ఈ మాటలు చెప్పడం లేదని మంచి కంటెంట్ మిస్ అవ్వకూడదని రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపాడు.

ఒకవేళ ఈ సినిమాకెళ్ళి మీకు నచ్చకపోతే జూన్ లో రిలీజ్ అవుతున్న తన "హిట్: ది థర్డ్ కేస్" సినిమా చూడవద్దని ఇంతకంటే బలంగా చెప్పలేనని చెప్పుకొచ్చాడు. దీంతో హీరో నాని చేసిన ఈ వాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఈ సినిమాపై నానితో పాటూ మొత్తం చిత్ర యూనిట్ కూడా ధీమాతో ఉన్నారు. అయితే సినిమా ఓటీటీ హక్కులని కూడా ఓ బడా సంస్థ డీసెంట్ రేట్ కి కొనుకున్నట్లు తెలుస్తోంది.. ఈ క్రమంలో బడ్జెట్ లోని 70% శాతం రిలీజ్ కి ముందే రికవరీ చేసినట్లు సమాచారం.

ALSO READ : ఓదెల రైల్వే స్టేషన్ పార్ట్-2 షూటింగ్లో విషాదం

 ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ స్టోరీ ఏంటంటే..  హర్ష్ రోషన్ ఓ డబ్బున్న అమ్మాయితో ప్రేమలో పడుతాడు. దీంతో చెట్టాపట్టాలేసుకుని తిరగుతుంటారు. ఈ విషయం కాస్తా అమ్మాయి తండ్రి(శివాజీ)కి తెలుస్తుంది. దీంతో తన పరపతి పలుకుబడి ఉపయోగించి హర్ష్ రోషన్ అరెస్ట్ చేయిస్తాడు.. అలాగే అమ్మాయి మైనర్ కావడంతో హర్ష్ రోషన్ పై పోక్సో యాక్ట్ క్రింద కేసు నమోదు చేయిస్తాడు. శివాజీ మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో ఈ కేసుని వాదించడానికి లాయర్లు ఎవరూ ముందుకు రారు. కానే యంగ్ లాయర్ ప్రియదర్శి ఈ కేసుని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలియాలంటే మార్చి 14 వరకూ ఆగాల్సిందే.