మరోసారి రిపీట్ చేస్తున్న నాని.. పండక్కి కొత్త సినిమా అప్డేట్

మరోసారి రిపీట్ చేస్తున్న నాని.. పండక్కి కొత్త సినిమా అప్డేట్

ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో నాని(Nani). అందుకే ఆయన్ని ప్రేక్షకులు ఆయన్ని ప్రేమగా నేచురల్ స్టార్(Natural star) అని పిలుచుకుంటారు. అందుకు తగ్గట్టుగానే ఆయన సినిమాల సెలక్షన్ కూడా అలాగే ఉంటుంది. ఇటీవలే దసరా(Dasara) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ హీరో.. త్వరలో ఎమోషనల్ కంటెంట్ తో తెరకెక్కిన హాయ్ నాన్న(Hi Nanna) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 

Also Read :- ఈ చిన్న సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది

ఇక తాజాగా దసరా పండుగ సందర్బంగా కొత్త సినిమాను ప్రకటించాడు నాని. అంటే సుందరానికి సినిమాతో ఆయనకు ప్లాప్ ఇచ్చిన దర్శకుడు వివేక్ ఆత్రేయ(Vivek athreya)తో నాని తన 31(Nani31)వ సినిమాను చేయనున్నాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ DVV ఎంటర్టైన్మెంట్స్(DVV Entertainments) బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సందర్బంగా ఒక వీడియోను కూడా షేర్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో.. ప్రెజెక్టు కు సంబందించిన మరిన్ని డీటెయిల్స్ అక్టోబర్ 23న, పూజా కార్యక్రమం అక్టోబర్ 24న ఉండనుందని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.