
తెలుగులో ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్, హిట్ 2 చిత్రాలు మంచి హిట్ అయ్యాయి. దీంతో దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్ర సీక్వెల్స్ పై దృష్టి సారించాడు. ఈ క్రమంలో హిట్ 3 : ది థర్డ్ కేస్ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటివరకూ డీసెంట్ ఫ్యామిలీ మెన్ లుక్ లో కనిపించిన నాని ఈ సినిమాలో కొంచెం రెబల్ లుక్ లో కనిపించనున్నాడు.
ఆమధ్య హీరో నాని సినిమా ఇండస్ట్రీకి వచ్చి 16 సంవత్సరాలు పూర్తవడంతో హిట్ 3 చిత్రం ఈ అప్డేట్ ఇచ్చారు. ఇందులోభాగంగా ఈ చిత్ర టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే గుర్తువరం గురువారం హీరో నాని హిట్ : ది థర్డ్ కేస్ టీజర్ అప్డేట్ ఇచ్చాడు. ఫిబ్రవరి 22న (శనివారం) టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఏ ఈ విషయానికి సంబంధించిన పోస్టర్ కూడా షేర్ చేశాడు. ఈ పోస్టర్ లో నాని గొడ్డలి ధరించి పవర్ఫుల్ లుక్ లో కనిపించాడు. దీంతో నాని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
Also Read :- ఓటీటీ కంటే ముందుగా టీవీలోకి సినిమా.. కారణం అదేనా.?
ఇక ఈ సినిమాలో నాని సరసన కెజీఎఫ్ మూవీ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మే 1వ తారీఖున విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఈ క్రమంలో ఇటీవలే విశాఖపట్నంలో చివరి షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ కి వచ్చింది. ప్రస్తుతం ఎడిటింగ్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. అయితే గత ఏడాది హీరో నాని సరిపోదా శనివారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో హిట్ 3 సినిమాతో హిట్ కొట్టి హిట్ ట్రాక్ ని కంటిన్యూ చెయ్యాలని చూస్తున్నాడు. మరోవేపు దర్శకుడు శైలేష్ కొలను గతంలో తీసిన సైంధవ్ సినిమా ప్లాప్ అయ్యింది. దీంతో హిట్ 3 సినిమాతో హిట్ అందుకోవాలని బాగానే శ్రమిస్తున్నాడు.
Sarkaar.
— Nani (@NameisNani) February 20, 2025
24-02-2025.
🚨#HIT3Teaser pic.twitter.com/5iprewz8Qy