Nani Upcoming Movies: నాని లైనప్ చూస్తే మతిపోవాల్సిందే..సాలిడ్ హిట్స్ కన్ఫమ్!

హీరో నేచురల్ స్టార్ నాని (Nani) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే హాయ్ నాన్న(Hi Nanna) సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న నాని.. ప్రస్తుతం దర్శకుడు వివేక్ ఆత్రేయ(Vivek Athreya)తో సరిపోదా శనివారం(Saripoda Sanivaram) అనే సినిమా చేస్తున్నాడు.ప్రియాంక మోహనన్(Priyanka Mohanan) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య(DVV Danayya) నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 24 నాని పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ వీడియోకి ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. 

అదే ఊపులో మరో రెండు సినిమాలను మొదలుపెట్టేశాడు నాని. పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేస్తున్న దర్శకుడు సుజీత్ (Sujeeth) తో తన 32వ సినిమాను మొదలుపెట్టేశాడు. గ్యాంగ్ స్టర్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా సంబందించిన అనౌన్స్మెంట్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియో సినిమాపై అంచనాలను పెంచుతోంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఓజీ తరువాత సుజీత్ తో నాని సినిమా చేయడంపై ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందు రానుంది. 

అలాగే రెండ్రోజుల క్రితమే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు నాని. దసరా సినిమాతో వందకోట్ల హిట్ ప్రాజెక్ట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ సినిమా షురూ చేసేశాడు. శ్రీకాంత్ తో కలిసి చేస్తున్నతన రెండో సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేయగా ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్లో నాని స్టైలిష్ లుక్, కోరా మీసాలతో కళ్లద్దాలు పెట్టుకుని కనిపిస్తుండంగా..ఊర మాస్ లెవల్లో బీడీ తాగుతున్న స్టిల్ ఆకట్టుకుంటోంది. 'నాయకుడిగా ఉండటానికి మీకు గుర్తింపు అవసరం లేదు..అనే ట్యాగ్ తో సినిమా ఏ విధంగా ఉండనుందో అనే అంచనాలు షురూ చేశారు శ్రీకాంత్.

అయితే ఈ మూవీ యాక్షన్ జోనర్ లో మంచి పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో నాని ఒక మాస్ నాయకుడిగా నటించనున్నారని తెలుస్తోంది.అలాగే దర్శకుడు శ్రీకాంత్ ఇంతవరకు తెలుగులో ఎవరు టచ్ చేయని పొలిటికల్ పాయింట్స్ ను ఈ సినిమాలో హైలెట్ చేయనున్నట్లు సినీ సర్కిల్ లో టాక్ ఊపందుకుంది. మొత్తానికి ఈ సినిమా కొత్త కథతో వస్తున్నట్లు పోస్టర్ తో క్లారిటీ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. 

ALSO READ :- ఈ స్మార్ట్ఫోన్ పై రూ.13వేల భారీ తగ్గింపు..డిటైల్స్ ఇవిగో

ఇక నాని ఫ్యూచర్ లైనప్ లిస్ట్ ఓ రేంజ్ లో ఉంది. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ, సుజిత్, శ్రీకాంత్ ఓదెల ఆ తర్వాత బలగం వేణుతో మంచి విలేజ్ లవ్ స్టోరీ చేయనున్నారట.ఇవే కాదు చాలా కాలంగా వినిపిస్తోన్న మరో రెండు సినిమాలు కూడా ఎప్పుడైనా రావొచ్చు..అవే త్రివిక్రమ్, శైలేష్ కొలనుతో చేయబోయే సినిమాలు. చూడాలి మరి నేచురల్ స్టార్ కొత్త చిత్రాలు ఎలా ఉంటాయో..ఇప్పటికైతే ఫ్యూచర్  సాలిడ్ హిట్స్ కన్ఫమ్!అనే టాక్ అయితే నడుస్తోంది.

  • Beta
Beta feature
  • Beta
Beta feature