![తమిళదర్శకుడితో.. తెలుగు హీరో గ్రీన్ సిగ్నల్](https://static.v6velugu.com/uploads/2023/12/hero-nani-is-a-new-movie-with-tamil-director-karthik-subbaraj_VnKAHZfDL7.jpg)
ఈ ఏడాది ‘దసరా’ లాంటి మాస్ ఎంటర్‌టైనర్‌తో సక్సెస్ అందుకున్న నాని, ఇటీవల ‘హాయ్ నాన్న’ అనే ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌తో ఆకట్టుకున్నాడు. మరోవైపు తను హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇది సెట్స్‌పై ఉండగానే తమిళ దర్శకుడితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ వినిపిస్తోంది. కల్ట్ సినిమాలు తీస్తాడనే పేరున్న కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోందట.
ఇప్పటికే కార్తీక్ ఓ కథ చెప్పాడని, అందుకు నాని పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యాడని టాక్. పాన్ ఇండియా స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నారట. ఇటీవల కార్తీక్ సుబ్బరాజ్ తీసిన ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ తెలుగులో మెప్పించలేకపోయినా, తమిళంలో సూపర్ హిట్ సాధించింది.
నిజానికి ‘పిజ్జా’ మినహా తన సినిమాలకు తెలుగులో ఆదరణ తక్కువే. ఈ క్రమంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా వస్తుందా అనే ఆసక్తి నెలకొంది. మరోవైపు ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లోనూ నాని ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.