
టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత సాహూ గారపాటి ఇటీవలే నిర్మించిన లైలా సినిమా డిజాస్టర్ అయ్యింది. దాదాపుగా రూ.35 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా కనీసం రూ.5 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. దీంతో నిర్మాత సాహూ గారపాటి కి రూ.25 కోట్లు పైగా లాస్ వచ్చినట్లు సమాచారం. అయితే ఇటీవలే నిర్మాత సాహూ గారపాటి నేచురల్ స్టార్ నాని ని కలిశాడు. ఈ సందర్భంగా నాని చేయబోయే నెక్స్ట్ సినిమాని సాహూ గారపాటి నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
గతంలో నాని నటించిన "టక్ జగదీశ్" సినిమాకి సాహూ గారపాటి నిర్మాతగ వ్యవహరించాడు. ఈ సినిమా దాదాపుగా రూ.55 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే ఓటిటిలో బాగానే వర్కౌట్ అయ్యింది. దీంతో స్వల్ప లాభాలతో బయటపడ్డాడు. అయితే ఈసారి పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా చేసేందుకు వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ కాబోతన్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా నాని సినిమాతో లైలా సినిమా నష్టాన్ని భర్తీ చేసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ALSO READ | 23 మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి
ఈ విషయం ఇలా ఉండగా హీరో నాని గత ఏడాది "సరిపోదా శనివారం" సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న "హిట్: ది థర్డ్ కేస్" సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో నాని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నటిస్తున్నాడు. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.