నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమె కామెంట్లపై హీరో నాని ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు. రాజకీయ నాయకులు ఎలాంటి అవాస్తవాలు మాట్లాడినా.. తప్పించుకోవచ్చని అనుకోవడం చూస్తే అసహ్యం వేస్తోందని హీరో నాని ట్విట్ చేశారు. ఇంత గౌరవప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన మాటలు మాట్లాడడం సరైంది కాదని Xలో రాసుకొచ్చారు.
ALSO READ : మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి: హీరో నాగార్జున
రాజకీయ నాయకుల మాటలు చాలా బాధ్యతారహితంగా ఉన్నప్పుడు, ప్రజల పట్ల మీకు ఏదైనా బాధ్యత ఉంటుందని ఆశించడం మా తెలివితక్కువ పని అని నటుడు నాని చీదరించుకున్నారు. విడాకులు అనేవి కేవలం నటులు లేదా సినిమా గురించి కాదు.. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదని ఆయన అన్నారు. మన సమాజాన్ని చెడుగా ప్రతిబింబించే ఇలాంటి ఆచారాన్ని మనందరం ఖండించాలని చెప్పారు.
Disgusting to see politicians thinking that they can get away talking any kind of nonsense. When your words can be so irresponsible it’s stupid of us to expect that you will have any responsibility for your people. It’s not just about actors or cinema. This is not abt any…
— Nani (@NameisNani) October 2, 2024