కోర్ట్‌‌‌‌‌‌‌‌ నన్ను గెలిపించింది : నాని

కోర్ట్‌‌‌‌‌‌‌‌ నన్ను గెలిపించింది : నాని

హీరో నాని సమర్పణలో ప్రియదర్శి లీడ్‌‌‌‌‌‌‌‌గా రామ్ జగదీష్ రూపొందించిన ‘కోర్ట్‌‌‌‌‌‌‌‌’ చిత్రం గత శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా టీమ్ సక్సెస్ మీట్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించింది. నాని మాట్లాడుతూ ‘ నేను  స్క్రిప్ట్, ప్రేక్షకులు.. ఈ రెండు విషయాలనే నమ్మాను.  ఈ విషయంలో అందరూ నన్ను  ప్రశంసిస్తున్నారు కానీ.. ‘కోర్ట్‌‌‌‌‌‌‌‌’ చిత్రమే నన్ను గెలిపించింది.  

రానున్న రోజుల్లో  ‘కోర్ట్’ పేరు మారుమ్రోగుతుంది.  సినిమాని ముందుకు తీసుకెళ్తున్న అందరికీ పేరు పేరునా థ్యాంక్యూ.   ఈ బ్యూటీఫుల్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. సెలబ్రేషన్స్  ఈ ఇయర్ అంతా కంటిన్యూ కావాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు. ఈ సినిమాను హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులు జాతి రత్నాలు అని ప్రియదర్శి అన్నాడు. ఇది తనకి గొప్ప ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్ అని శివాజీ చెప్పాడు.  

ఈ సినిమా విషయంలో చాలా ప్రౌడ్‌‌‌‌‌‌‌‌గా ఫీలవుతున్నా అని డైరెక్టర్ రామ్ జగదీష్ అన్నాడు. తాము అనుకున్నదాని కంటే సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉందని నిర్మాతలు ప్రశాంతి, దీప్తి గంటా అన్నారు.  సక్సెస్‌‌‌‌‌‌‌‌లో భాగమవడం హ్యాపీగా ఉందని నటులు రోషన్, శ్రీదేవి,  రోహిణి, హర్ష వర్ధన్, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి  అన్నారు.   మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్, లిరిక్ రైటర్ పూర్ణాచారి పాల్గొన్నారు.