Ayaan,Arjun: మొన్న అయాన్.. నేడు అర్జున్.. నెక్స్ట్ జనరేషన్ కూడా గట్టిగానే!

స్టార్ మాత్రమే కాదు వాళ్ళ పిల్లలు కూడా చాలా ఫాస్ట్ గా ఉన్నారు. జెనరేషన్ అండ్ టెక్నాలజీ మారుతున్నట్టే పిల్లలు కూడా స్పీడప్ అవుతున్నారు. మ్యూజిక్ అనీ, డాన్స్ అని, యాక్టింగ్ అని ఎదో ఒక రంకంగా తమ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నారు. కొన్నిరోజుల క్రితం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తనయుడు అకీరా నందన్(Akira Nandan) పోయనోపై యానిమల్ సినిమాలోని ఫాథర్ పాట ప్లే చేసి అందరికి షాకిచ్చాడు. నిన్నకాక మొన్న అల్లు అర్జున్(Allu Arjun) కుమారుడు అల్లు అయాన్(Ayan) కూడా పాట పాడి వైరల్ అయ్యాడు. షారుఖ్ నటించిన లేటెస్ట్ మూవీ డంకి సినిమాలో లుట్ పుట్ గయా పాటను పాడగా. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. దీంతో ఆ వీడియోకి షారుఖ్ సైతం రిప్లై ఇవ్వడం విశేషం. 

ఇక తాజాగా ఆ లిస్టులో నేచురల్ స్టార్ నాని(Nani) కొడుకు అర్జున్(Arjun) కూడా చేరిపోయాడు. ఇటీవల హీరో నాని పుట్టినరోజు జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుకలో నాని కొడుకు అర్జున్ పియానోపై నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలోని హొయనా.. హొయనా పాటను ప్లే చేశారు. కొడుకు తన సినిమాలోని పాటను పియానోలో ప్లే చేయడంతో అనడంతో మురిసిపోయాడు నాని. ఆ క్యూట్ సన్నివేశాన్ని వీడియోలో బంధించిన నాని భార్య అంజనా ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. 

ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. మొన్న అకిరా, నిన్న అయాన్, నేడు అర్జున్.. నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నాని సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే హాయ్ నాన్నతో డీసెంట్ హిట్ అందుకున్న నాని.. త్వరలో సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత ఓజీ దర్శకుడు సుజీత్ తో ఓ గ్యాంగ్ స్టార్ మూవీ చేయనున్నాడు నాని.