
వరుస కమిట్ మెంట్స్ తో నాని డైరీ ఫుల్ అయిపోయింది. అయితే కరోనా వచ్చి అన్ని పనులకీ బ్రేక్ వేసింది. ‘వి’ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. శివ నిర్వాణ దర్శకత్వం లో ‘టక్ జగదీష్’.. ‘ట్యాక్సీ వాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం లో ‘శ్యామ్ సింగరాయ్’.. వివేక్ ఆత్రేయతో ఒక సినిమా.. మరోపక్క నిర్మాతగా బాధ్యతలు.. ఎక్కడా తీరిక లేకుండా ఉన్నాడు. మిగతా వాటి సంగతెలా ఉన్నా ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ విషయంలో అందరికీ ఆసక్తి ఎక్కువయ్యింది. ఆ మూవీ టైటిల్ అనౌన్స్చేసినప్పుడే ఒక విధమైన క్యూరి యాసిటీ అందరిలోనూ ఏర్పడింది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమవ్వాల్సిం ది. కానీ లాక్ డౌన్ కారణంగా ఇంకా పట్టాలెక్కలేదు. అయితే రోజుకో వార్త మాత్రం బైటికొస్తోంది. ఇందులో నాని మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడట. ముగ్గు రు హీరోయిన్స్ కూడా ఉంటారట. ఆల్రెడీ ఒక హీరోయిన్‌గా సాయి పల్లవిని సెలెక్ట్ చేశారని చాలా రోజులుగా వినిపిస్తోంది. మరో హీరోయిన్‌గా చేయమని రష్మిక మందాన్నను అడిగితే ఆమె ఇంటరెస్ట్ చూపించలేదట. దాంతో మాళవిక మోహనన్‌ని, శోభిత ధూళిపాళని తీసుకున్నట్లు తెలుస్తోంది.