పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మరో స్టార్ హీరో...

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రమంతా హడావిడి ఒక ఎత్తు అయితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో హడావిడి మరొక ఎత్తు.2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిన పవన్, ఈసారి ఎన్నికల్లో ఎలా అయినా గెలిచి తీరాలన్న కసితో పిఠాపురంలో సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. పవన్ కళ్యాణ్ కు మద్దతు మెగా ఫ్యామిలీతో పాటు టాలీవుడ్ సెలెబ్రిటీలు, టీవీ ఆర్టిస్టులు కూడా పిఠాపురంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ఓక వీడియో రిలీజ్ చేయగా, మరో స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని పవన్ కు మద్దతుగా తన ఎక్స్ ( ట్విట్టర్ ) ద్వారా ట్వీట్ చేశాడు. "డియర్ పవన్ కళ్యాణ్ గారు, మీరు తలపడుతున్న రాజకీయ సమరంలో తప్పకుండా మీరు అనుకున్న విజయం సాధిస్తారని, ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని సినీ కుటుంబంలో ఒకడిగా కోరుకుంటున్నా, నాతో పాటు అందరి మద్దతు మీకు ఉంటుందని ఆశిస్తున్నా. అల్ ది వెరీ బెస్ట్ సార్" అంటూ ట్వీట్ చేశాడు నాని. మరి, పిఠాపురంలో జరగనున్న ఉత్కంఠ పోరులో పవన్ విజయం సాధిస్తారా లేదా వేచి చూడాలి .