Nani: భార్య, కొడుకుతో కలిసి..కాలినడకన తిరుమలకు హీరో నాని

Nani: భార్య, కొడుకుతో కలిసి..కాలినడకన తిరుమలకు హీరో నాని

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని(Nani) కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. నాని వెంట ఆయన భార్య అంజన, తనయుడు అర్జున్ తో కలిసి అలిపిరి మార్గంలో తిరుమల వెళ్లారు. వీరితోపాటుగా సరిపోదా శనివారం సినిమా హీరోయిన్ అరుళ్‌ మోహన్‌ కూడా ఉన్నారు. అనంతరం తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక నాని కాలినడకన తిరుమలకు వెళ్లే మార్గంలో అభిమానులకి సెల్ఫీలు ఇస్తూ సరదాగా గడిపారు.

ప్రస్తుతం నాని హీరోగా సరిపోదా శనివారం సినిమా ఆగస్ట్ 29న పాన్ ఇండియా వైడ్‌‌‌‌గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో  సినిమా విడుదల కానుంది.ఈ సందర్బంగా నాని తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్‌ఈవెంట్‌ను ఇవాళ ఆగస్టు 24న గ్రాండ్‌గా నిర్వహించనున్నారు మేకర్స్.

ఇప్పటికీ ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ విజువల్స్ ఆడియన్స్ లో బాగా ఇంపాక్ట్ చూపాయి. అలాగే, నాని చేస్తున్న వరుస ప్రమోషన్స్, ఇంటర్వూస్ ఆడియన్స్ లో అంచనాలు పెంచేస్తోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సరిపోదా శనివారం’  సినిమాని డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి  నిర్మిస్తున్నారు.

ఇందులో నాని, రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌‌‌‌లో కనిపించనున్నాడు. ఒక పాత్రలో రగ్డ్ లుక్‌‌‌‌లో నటించగా, మరో పాత్రలో సాఫ్ట్‌‌‌‌గా కనిపిస్తాడు. ప్రియాంక మోహన్ పోలీస్ కానిస్టేబుల్‌‌‌‌ పాత్ర పోషిస్తోంది. ఎస్‌‌‌‌జే సూర్య, సాయి కుమార్  కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.