Nara Rammurthy: తండ్రి మరణం తర్వాత బై నాన్న అంటూ నారా రోహిత్ ఎమోషనల్ ట్వీట్...

Nara Rammurthy: తండ్రి మరణం తర్వాత బై నాన్న అంటూ నారా రోహిత్ ఎమోషనల్ ట్వీట్...

టాలీవుడ్ ప్రముఖ హీరో నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి అనారోగ్యం కారణంగా శనివారం రోజు  మృతి చెందారు. దీంతో నారా రోహిత్ సోషల్ మీడియా వేదికగా తన తండ్రికి వీడ్కోలు చెబుతూ ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు. ఇందులోభాగంగా "నాన్న మీరొక గొప్ప ఫైటర్. మీరు ప్రేమానురాగాలతో ఎలా గెలవాలనే విషయాలను నేర్పించారు. 

మీరు నేర్పించిన విషయాల వల్లే నేను ఇవ్వాళ ఈ స్థాయిలో ఉన్నాను. మీరు మాకోసం ఎన్నో త్యాగాలు చేశారు. అలాగే మీ జ్ఞాపకాలు నాతో చాలా ఉన్నాయి. జీవితాంతం స్మరించుకుంటాను" అని ఎక్స్ లో పేర్కొన్నాడు. అలాగే చిన్నప్పుడు తనతండ్రి ఎత్తుకున్న ఫోటోని షేర్ చేశాడు. దీంతో తండ్రి మరణంతో దుఖం లో ఉన్న నారా రోహిత్ ని అభిమానులు ఓదార్చుతున్నారు.

Also Read : పరిచయం : పైలట్ కావాల్సింది.. యాక్టర్​నయ్యా

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నారా రోహిత్ తెలుగులో సుందరకాండ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.  సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ పై రాకేశ్ రెడ్డి, సంతోష్, గౌతమ్ తదితరులు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీ దేవి విజయ్ కుమార్ హీరోయిన్ గా నటిస్తోంది.