హీరో నవదీప్ ఈరోజు(సెప్టెంబర్ 23) నార్కోటిక్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో A29గా నవదీప్ ను పోలీసులు విచారిస్తున్నారు. డ్రగ్స్ సప్లయర్ రామచందర్, నవదీప్ కు ఉన్న సంబంధాలపై ఆరా తీయనున్నారు నార్కోటిక్ పోలీసులు.
హీరో నవదీప్ ద్వారా ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా అయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సప్లయర్ రామచందర్ పట్టుబడిన తర్వాత నవదీప్ అజ్ఞాతంలో ఉండిపోయారు. డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు రావడంతో ముందస్తు బెయిల్ కొరకు హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెల్ పిటిషన్ కొట్టేసి 41ఏ సిఆర్పిసి కింద విచారణకు హాజరు కావాలని నవదీప్ కు హైకోర్టు సూచించింది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి.. ఆ తర్వాత రిమాండ్ కు వెళ్లిన రామ్ చంద్ దగ్గర నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు నార్కోటిక్ పోలీసుల దగ్గర ఆధారాలున్నాయి.
ALSO READ : ఆసియా గేమ్స్‌లో..తెలంగాణ బిడ్డలు
కాగా.. మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసులు ఇప్పటివరకు మొత్తంగా 11 మందిని అరెస్ట్ చేశారు. అందులో నవదీప్ సన్నిహితుడైన రామ్ చంద్ కూడా ఉన్నాడు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకే.. నవదీప్ కూడా డ్రగ్స్ కన్జ్యూమర్‌గా గుర్తించారు. అయితే.. ముందుగా పరారీలో ఉన్నారంటూ పోలీసులు స్టేట్ మెంట్ ఇవ్వగా.. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ స్పదించాడు నవదీప్. అయితే.. తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదంటూ వివరణ కూడా ఇచ్చారు. అయితే.. అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని.. తాను ఎవరి ద్వారా డ్రగ్స్ కొన్నాడు, ఎక్కడ కొన్నాడు.. అన్న వివరాలు త్వరలోనే బయటకొస్తాయంటూ పోలీసులు పేర్కొన్నారు.