జాతిరత్నాలు ఫేమ్ హీరో నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty) అమెరికాలో యాక్సిడెంట్ కి గురయ్యారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికా వీధుల్లో బైక్‌పై వెళ్తున్న నవీన్ పోలిశెట్టి.. స్కిడ్ అయి కింద పడటంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ఈ ప్రమాదంలో ఆయన చేతికి ఫ్రాక్చర్ అయిందని, రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు టాక్. దీంతో ఈ హీరో ప్రస్తుతం చేస్తున్న సినిమా షూట్స్ కి బ్రేక్ పడనుంది. ఇక నవీన్ పోలిశెట్టి ప్రమాదం గురించి తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నారు. గాయాల నుండి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తన్నారు.
ఇక నవీన్ పోలిశెట్టి సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే మిస్ శెట్టి మిస్టర్ పిలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నవీన్ డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తరువాత అనగనగా ఒకరాజు అనే సినిమా చేస్తున్నారు నవీన్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కాకుండా మరో రెండు క్రేజీ సినిమాలను కూడా లైన్లో పెట్టాడు నవీన్ పోలిశెట్టి.