ఫెయిల్యూరే పెద్ద వ్యసనం

ఫెయిల్యూరే పెద్ద వ్యసనం

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా, ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మిస్తున్న  చిత్రం ‘సారంగదరియా’. శుక్రవారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హీరో నిఖిల్ విడుదల చేసి టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. ట్రైలర్‌‌‌‌‌‌‌‌లో  మిడిల్ క్లాస్ ఫాదర్, గొప్ప టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రాజా రవీంద్ర కనిపించాడు. కులం అంటే రక్తం కాదు పుట్టుకతో రావడానికి, మనం చేసే పనే కులం.., మందు, సిగరెట్, పేకాట, బెట్టింగ్‌‌‌‌‌‌‌‌లకంటే పెద్ద వ్యసనం ఫెయిల్యూర్..

ఇక్కడ చెప్పిన పాఠాలకే పరీక్షలు పెడతాం కానీ జీవితం పరీక్షలు పెట్టి గుణపాఠాలు చెబుతుంది’ అనే డైలాగ్స్ సినిమాలోని కథ, కథనాలపై ఆసక్తిని పెంచుతున్నాయి.  ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో జరిగే సంఘర్షణలను ఇందులో చూపిస్తున్నాం అని దర్శక నిర్మాతలు చెప్పారు. శ్రీకాంత్ అయ్యంగార్,శివ చందు, యశస్విని, మొయిన్ , కాదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, హర్షవర్ధన్  ఇతర పాత్రలు పోషించారు. జులై 12న సినిమా రిలీజ్ కానుంది.