ప్రైవేట్ వీడియోపై క్లారిటీ ఇచ్చిన హీరో నిఖిల్.. అందులో ఉన్నది వాళ్లేనంటూ...

ప్రైవేట్ వీడియోపై  క్లారిటీ ఇచ్చిన హీరో నిఖిల్.. అందులో ఉన్నది వాళ్లేనంటూ...

టాలీవుడ్ లో ఇటీవలే మస్తాన్ సాయి అరెస్ట్ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. అయితే మస్తాన్ సాయి దాదాపుగా 3 వందలమందికి పైగా సినీ నటులకి సంబంధించిన అశ్లీల వీడియోలు, ఫోటోలు ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఇందులో తెలుగు స్టార్ హీరో నిఖిల్ సిద్దార్థ్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయని లావణ్య అనే యువతి పేర్కొంది. దీంతో నిఖిల్ గురించి సోషల్ మీడియా మాధ్యమాలలో పలు వార్తలు బలంగా వైరల్ అవుతున్నాయి. 

ఈ వార్తలపై నిఖిల్ స్పందించాడు. ఇందులో భాగంగా తనపై జరుగుతోన్న ప్రచారాలను నిఖిల్ ఖండించాడు. అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్న వీడియోలను రాంగ్ గా ప్రొజెక్ట్ చెస్తున్నారని సీరియస్ అయ్యాడు. కార్తికేయ 2 సక్సెస్ మీట్ అనంతరం జరిగిన డిన్నర్ పార్టీ వీడియోలని వక్రీకరిస్తూ ఉన్నవి లేనివి కల్పించి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని, ఈ వీడియోలో ఉన్నది తన కుటుంబ సభ్యులేనని క్లారిటీ ఇచ్చాడు. వాస్తవం ఎంటనేది పోలీసులకు కూడా తెలుసని కాబట్టి తన గురించి నిజానిజాలు తెలియకుండా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు.

ఈ విషయం ఇలా ఉండగా నిఖిల్ ఆమధ్య హీరోగా నటించిన అప్పుడో, ఇప్పుడో, ఎప్పుడో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ సినిమా ఫ్లాప్ అయ్యింది.