అమరన్‌‌‌‌‌‌‌‌ ఆ థియరీని బ్రేక్ చేసింది

అమరన్‌‌‌‌‌‌‌‌ ఆ థియరీని బ్రేక్ చేసింది

శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా రాజ్‌‌‌‌‌‌‌‌కుమార్ పెరియసామి తెరకెక్కించిన చిత్రం ‘అమరన్‌‌‌‌‌‌‌‌’.  కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మించారు. హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి తెలుగులో విడుదల చేశారు.  బుధవారం ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు.  ముఖ్య​అతిథిగా హాజరైన నితిన్ మాట్లాడుతూ ‘ఒక దేశభక్తి సినిమాలో లవ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌ని బ్లెండ్ చేయడం అంత సులభం కాదు.  చాలా అద్భుతంగా తీశారు.

క్లైమాక్స్ సీన్స్‌‌‌‌‌‌‌‌ నిజంగా హార్ట్ టచింగ్. సాయి పల్లవి గారి వర్క్‌‌‌‌‌‌‌‌కి నేను పెద్ద అభిమానిని. ఇందులో నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. శివ కార్తికేయన్ జీవించేశారు’ అని చెప్పాడు.  సాయి పల్లవితో కలిసి చేసిన  ఫస్ట్ సినిమానే పెద్ద సక్సెస్ కావడం సంతోషంగా ఉందని శివ కార్తికేయన్ సంతోషం వ్యక్తం చేశాడు.సాయి పల్లవి మాట్లాడుతూ ‘ప్రేక్షకులు ఒక్కొక్క ఎమోషన్‌‌‌‌‌‌‌‌కు రియాక్ట్ అవుతున్నారని తెలిసి చాలా ఎమోషనల్‌‌‌‌‌‌‌‌గా అనిపించింది. భానుమతి, వెన్నెల తరహాలో ఇందు పాత్రకు గొప్ప స్పందన లభించడం హ్యాపీ’ అని చెప్పింది.

ఆర్మీ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్ సినిమాలను సౌత్‌‌‌‌‌‌‌‌ ప్రేక్షకులు ఆదరించరనే థియరీని ఈ సినిమాతో బ్రేక్ చేసిన ప్రేక్షకులకు దర్శకుడు థ్యాంక్స్ చెప్పాడు. దర్శకుడు వెంకీ కుడుముల ‘అమరన్’ టీమ్‌‌‌‌‌‌‌‌కు శుభాకాంక్షలు చెప్పాడు. ఇప్పటికే రూ.20 కోట్లు వసూలు చేయడం ఆనందంగా ఉందని, ఈ సినిమాకు నాలుగు నేషనల్ అవార్డులు వస్తాయని నిర్మాత సుధాకర్ రెడ్డి అన్నారు.  లిరిక్ రైటర్ కృష్ణ కాంత్, డైలాగ్ రైటర్ హనుమాన్ పాల్గొన్నారు.