టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్కు ఉన్న క్రేజీ వేరు. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి డైరక్షన్లో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా చేస్తున్నారు.
అయితే తాజా అప్డేట్స్ ప్రకారం.. వెంకటేష్ ఓ తమిళ డైరెక్టర్తో సినిమా చేయబోతున్నాడని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. టీఎన్ సంతోష్ డైరక్షన్లో త్వరలోనే ఓ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథతో మూవీ తెరకెక్కబోతోనట్లు సమాచారం.
ALSO READ | Instagram: ఇంస్టాగ్రామ్లో ప్రభాస్ బ్యూటీ హవా.. ఇండియన్ హీరోయిన్లలో ఈమెదే అగ్ర స్థానం
ఇప్పటికే డైరెక్టర్ సంతోష్ వెంకటేష్కు స్టోరీ వినిపించడంతో.. ఆయన ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. కాగా ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలో ఓ పవర్‌ఫుల్ పోలీసుగా వెంకటేష్ కనిపించున్నాడట. అయితే ఈ సినిమాలో వెంకీకి జోడిగా యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ నటిస్తున్నట్లు టాక్. ఈ మేరకు మూవీ టీం కీర్తిని సంప్రదించగా ఆమె కూడా వెంటనే ఒకే చేశారట.
అలాగే ఈ సినిమా కథ నచ్చి.. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన సొంత బ్యానర్ అయిన శ్రీస్ట్ మూవీస్పై నిర్మించేందుకు సిద్దమయ్యాడట.ఇక ఇలాంటి క్రేజీ న్యూస్ విన్నాక వెంకీ ఫ్యాన్స్లో ఉత్సాహం మరింత రెట్టింపు అవుతుందనే చెప్పాలి. మేకర్స్ త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. డైరెక్టర్ టీఎన్ సంతోష్ తెలుగులో నిఖిల్ హీరోగా వచ్చిన అర్జున్ సురవరం సినిమా డైరెక్ట్ చేసాడు.