యూత్ స్టార్ నితిన్(Nithin) హీరోగా, వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్(Venu Sriram) ఓ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటి లయ(Laya) నితిన్ అక్కగా కీ రోల్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమాకు తమ్ముడు(Thammudu) టైటిల్ ఫిక్స్ చేశారు. పవన్ కల్యాణ్(Pawan kalyan) హీరోగా నటించిన తమ్ముడు(Thammudu) సినిమా టైటిల్ తో నితిన్ వస్తుండటంతో అంచనాలు పెరిగిపోయాయి. నితిన్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి వీరాభిమాని అని తెలిసిందే. దాంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం ఇరువురి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తమ్ముడు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. " హిజ్ రిమార్కబుల్ రెజిలెన్స్.. హిజ్ మాసివ్ పవర్.. శక్తివంతమైన కథతో తమ్ముడు 2025 మహాశివరాత్రికి వచ్చేస్తున్నాడు" అంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.
'తమ్ముడు' కాన్సెప్ట్::
పోస్టర్ చూస్తుంటే.. ఊరంతా ఒకటై నితిన్‌ను వెంటాడుతున్నట్లు చూపించారు. నితిన్.. ఒక పాపను ఎత్తుకొని పరిగెడుతున్నట్లు డిజైన్ చేసిన పోస్టర్ మాత్రం నెక్స్ట్ లెవల్‌లో ఉంది. ఫ్యామిలీ కోసం ఎంతకైనా తెగించే వ్యక్తిలా కనిపిస్తున్నాడు నితిన్. పైన చెప్పినట్టు ఈ మూవీ అక్కా, తమ్ముడి సెంటిమెంట్ చుట్టూ కథ తిరుగుతుందట.
ALSO READ : బెల్లంకొండ సాయి భైరవం ఫస్ట్ లుక్
అత్తారింట్లో అష్ట కష్టాలు పడుతున్న అక్కను కాపాడటానికి తమ్ముడి చేసే పోరాటమే సినిమా స్టోరీ అని సినీ వర్గాల నుంచి టాక్. మొత్తంగా రొటీన్‌కు భిన్నంగా వేణు శ్రీరామ్ ఈ సినిమా తీస్తున్నట్టు రిలీజైన పోస్టర్స్ చూస్తే అర్థమవుతోంది.
‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దిల్, శ్రీనివాస కళ్యాణం చిత్రాల తర్వాత దిల్ రాజు నిర్మాతగా నితిన్ నటిస్తున్న మూడో చిత్రమిది. అలాగే ఈ బ్యానర్‌లో ఎంసీఏ, వకీల్ సాబ్ తర్వాత వేణుశ్రీరామ్ తీస్తున్న మూడో చిత్రం కూడా. ఇదిలా ఉంటే నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘రాబిన్‌హుడ్’ లో నటిస్తున్నాడు.
His Remarkable 𝐑𝐄𝐒𝐈𝐋𝐈𝐄𝐍𝐂𝐄🔥
— Sri Venkateswara Creations (@SVC_official) November 4, 2024
His Massive 𝐏𝐎𝐖𝐄𝐑💥
Make Way for a New Brother in Town @actor_nithiin 😎#Thammudu Arriving on Maha Shivaratri - 2025 with a Powerful Tale of Courage and Ambition🔱❤️🔥#ThammuduForShivaratri
A Film by #SriramVenu#DilRaju… pic.twitter.com/RdL3etjOxv