కామెడీ క్రైం కథ..." లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్"

జాతిరత్నాలు ఫేమ్..చిట్టి అదేనండి ఫరియా అబ్దుల్లా మరో మూవీతో మెరిసేందుకు సిద్ధమైంది. యువహీరో సంతోష్ శోభన్తో ఆమె జతకట్టింది. మేర్లపాక గాంధీ డైరెక్షన్లో వినూత్న టైటిల్తో మూవీ తెరకెక్కింది. లైక్ షేర్ సబ్ స్క్రైబ్ పేరుతో మూవీ రాబోతుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. కామెడీ ఎంటర్ టైనర్గా రాబోతున్న చిత్ర టీజర్ను నటుడు నితిన్ లాంఛ్ చేశారు. 

 సంతోష్ శోభన్  ట్రావెల్ బ్లాగర్‌గా మారాలనుకుంటాడు. తన స్నేహితుడు నెల్లూరు సుదర్శన్‌తో కలిసి అందమైన ప్రదేశాలకు ప్రయాణిస్తాడు. ఈ ప్రయాణంలో సంతోష్..ఫరియా అబ్దుల్లాను చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమెను ప్రేమలో పడేసేందుకు నానా తంటాలు పడతాడు. వీరి లవ్ ట్రాక్ సాగుతున్న క్రమంలో సంతోష్ ఒక క్రైంలో ఇరుక్కుంటాడు. అసలు సంతోష్ శోభన్కు ఈ క్రైంకు సంబంధం ఏంటీ..దాని నుంచి అతను ఎలా బయటపడ్డాడు.. ఫరియా అబ్దుల్లా ప్రేమను గెలుచుకున్నాడా అనేది సస్పెన్స్గా చూపించారు. మొత్తంగా ఈ చిత్రంలో రొమాన్స్, క్రైంతో పాటు..కామెడీ అంశాలు పుష్కలంగా ఉండే అవకాశం ఉందని టీజర్ను చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రంలో  బ్రహ్మాజీ కీ రోల్ చేస్తున్నారు.

లైక్ షేర్ సబ్ స్క్రైబ్ చిత్రాన్ని వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు.  నిహారికా ఎంట‌ర్ టైన్ మెంట్స్ , అమృత క్రియేష‌న్స్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి.  ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు. వసంత్ సినిమాటోగ్రాఫర్గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్గా పని చేస్తున్నారు. నవంబర్‌లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.