హీరో ఫ్యాషన్ ప్లస్ మళ్లీ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే..

హీరో ఫ్యాషన్ ప్లస్ మళ్లీ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే..
దాదాపు మూడు సంవత్సరాల తర్వాత హీరో ప్యాషన్ ప్లస్(Hero Passion Plus) బైక్  ఇండియన్ మార్కెట్లోకి మళ్లీ విడుదలకాబోతుంది. బీఎస్‌ 6 మార్గదర్శకాల తర్వాత నిలిపివేసిన ఈ బైక్‌.. మూడేళ్ల తర్వాత మార్కెట్‌లోకి విడుదల కావడంతో ఈ కొత్త హీరో బైక్ గురించిన పూర్తి వివరాలు  మీ కోసం.. 

హీరో మోటోకార్ప్ తన ప్రముఖ మోటార్‌సైకిల్ ప్యాషన్ ప్లస్‌ను త్వరలో విడుదల చేయబోతున్నట్లు గతంలో పేర్కొంది. దీంతో ఇప్పుడు అప్‌డేట్ చేయబడిన హీరో ప్యాషన్ ప్లస్ బైక్ ఎన్నో అంచనాల మధ్య మార్కెట్‌లోకి విడుదలకాబోతుంది. 3 సంవత్సరాల తర్వాత హీరో ప్యాషన్ ప్లస్ బైక్‌ను మళ్లీ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

ప్యాషన్​ ప్లస్  రీ ఎంట్రీ..

హీరో ప్యాషన్​ ప్లస్​మార్కెట్​లోకి మళ్లీ రానుంది. పాత మోడల్లోనే కొత్త ఫీచర్లతో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.  దేశీయ దిగ్గజ టూవీలర్​ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్​.. ప్యాషన్​ ప్లస్​ను తిరిగి ఇండియా మార్కెట్​లో లాంచ్​ చేయనుంది. ఈ నెలలోనే (జూన్)  హీరో ప్యాషన్​ ప్లస్​ 2023 మోడల్​ రోడ్ల మీద దర్శనమిస్తుందని తెలుస్తోంది. 2020 ఏప్రిల్‌లో అమల్లోకి వచ్చిన BS6ఉద్గార నిబంధనల కారణంగా హీరో మోటోకార్ప్‌ ప్యాషన్ ప్లస్ బైక్‌ను నిలిపివేసింది. BS6 మార్గదర్శకాల ప్రకారం అప్‌డేట్ చేయడంలో కొన్ని అవాంతరాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్‌ 2023 నుంచి BS6 యొక్క 2వ దశ నిబంధనలు అమల్లోకి రావడంతో Hero Passion Plusను ఇప్పుడు రీలాంచ్‌ చేసింది. 

ఫ్యామిలీ బైక్ 

హీరో ప్యాషన్ ప్లస్ మంచి మైలేజ్‌తో పాటు ఫ్యామిలీ బైక్ పేరుతెచ్చుకున్న హీరో మోడల్‌ బైక్‌లలో ప్యాషన్ ప్లస్ కూడా ఒకటి. 2001లో  ప్యాషన్ ప్లస్ బైక్​ను ఇండియాలోకి తీసుకొచ్చింది హీరో మోటోకార్ప్​. అనేక ఏళ్ల పాటు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉంది. ఈ మోడల్​ను సంస్థ తయారు చేయడం ఆపడంతో ప్యాషన్​ ప్లస్​కు మాత్రం కాస్త బ్రేక్​ వచ్చింది. . ఇప్పుడు తన పోర్ట్​ఫోలియోను పెంచుకోవాలని చూస్తున్న హీరోమోటో కార్ప్​.. కొత్త కొత్త మోడల్స్​తో పాటు పాత వాటిని తిరిగి తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే ప్యాషన్​ ప్లస్​ త్వరలోనే ఇండియాలోకి తిరిగి అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది.

హీరో ప్యాషన్​ ప్లస్ ..లుక్ పరంగా దానికి అదే సాటి..

హీరో ప్యాషన్ ప్లస్ డిజైన్​ పరంగా చూసుకుంటే.. హీరో ప్యాషన్​ ప్లస్​లో స్వల్పంగా అప్​గ్రేడ్స్​ ఉంటాయి. ఇందులో మస్క్యులర్​ ఫ్యూయెల్​ ట్యాంక్​, సెమీ- ఫైర్డ్​ హెడ్​ల్యాంప్​ యూనిట్​, స్మాల్​ విండ్​ డిఫ్లెక్టర్​, ఫ్లాట్​ టైప్​ సింగిల్​ పీస్​ సీట్​, వైడ్​ హ్యాండిల్​బార్​, ఓవల్​ షేప్​ మిర్రర్స్​, సైడ్​ మౌంటెడ్​ ఎగ్సాస్ట్​, సెమీ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ వంటివి లభిస్తాయి. బ్లాక్​డ్​ ఔట్​ మల్టీ స్పోక్​ అలాయ్​ వీల్స్​ కూడా కొత్త ప్యాషన్ ప్లస్‌లో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అదిరిపోయే ఇంజన్

హీరో ప్యాషన్ ప్లస్‌ కొత్తగా రూపొందించే  బైక్ లో  97.2 సీసీ, సింగిల్ సిలిండర్ 'స్లోబర్' ఇంజిన్ కలిగి ఉంది.  ఈ మోడల్​లో , ఎయిర్​ కూల్డ్​, ఫ్యూయెల్​ ఇంజెక్టెడ్​, ​, బాక్సర్​ టైప్​ ఇంజిన్​ ఉండే అవకాశం ఉంది. ఇటీవల స్ప్లెండర్​ ప్లస్​ మోడల్​లోనూ ఇదే ఉంది.  OBT-2 కంప్లైంట్ మరియు E20 ఫ్యూయెల్‌ అనుకూలతకు ప్యాషన్‌ ప్లస్‌ అప్‌గ్రేడ్ చేయబడింది. ఇంజిన్ I3S స్టార్ట్/స్టాప్ టెక్నాలజీని కలిగి ఉంది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 8 hp పవర్ వద్ద 8.05 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 4 స్పీడ్​ గేర్​బాక్స్​ ఉంటుంది.

త్రీ కలర్స్ లో డిజైన్

హీరో ప్యాషన్ ప్లస్ బైక్ సస్పెన్షన్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్‌లను అమర్చారు. కొత్త ప్యాషన్ ప్లస్ బైక్ బరువు 115 కిలోలుగా ఉంది. ఇది ప్రస్తుతం అత్యంత బరువైన 100సీసీ హీరో బైక్‌గా మార్కెట్‌లో నిలిచింది. ఇక హీరో ప్యాషన్‌ ప్లస్‌లో బ్రేక్‌ల విషయానికొస్తే వాటి కోసం ముందు మరియు వెనుక చక్రాలకు 130mm డ్రమ్ బ్రేక్‌లు అమర్చారు. కొత్త ప్యాషన్ ప్లస్ బైక్‌లో కాస్ట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ చక్రాలు 80/100-18 కొలతలతో ట్యూబ్‌లెస్ టైర్‌లతో అమర్చబడి ఉంటాయి. ఈ కొత్త హీరో బైక్‌ను 3 విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంది. 

సాంకేతిక ఫీచర్లు

హీరో ప్యాషన్ ప్లస్ లో సెల్ఫ్ స్టార్ట్, డిజిటల్ అనలాగ్ డిస్‌ప్లే మరియు USB ఛార్జింగ్ సౌకర్యం ఉన్నాయి. ఇది హీరోకి చెందిన అత్యంత ఖరీదైన 100సీసీ బైక్. ఇటీవల హీరో మోటోకార్ప్ 2023 హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌ను విడుదల చేసింది. దానిని అనుసరించి ఇప్పుడు ప్యాషన్ ప్లస్ బైకును కూడా మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. స్ప్లెండర్ మరియు హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌లతో భారత్‌లో బైక్‌లను విక్రయించడంలో హీరో మోటోకార్ప్‌ ముందు వరుసలో ఉంది. కొత్త ప్యాషన్ ప్లస్ బైక్ విడుదలతో హీరో ఆధిపత్యం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. 

సేఫ్టీలోని రాజీలేదు

హీరో ప్యాషన్ ప్లస్  బైక్​ ఫ్రెంట్​లో డిస్క్​ బ్రేక్​, రేర్​లో డ్రమ్​ బ్రేక్​ ఉండొచ్చు. కంబైండ్​ బ్రేకింగ్​ సిస్టెమ్​ వంటి ఫీచర్స్​ చేర్చనున్నారు. సస్పెషన్స్​ కోసం ఫ్రెంట్​లో టెలిస్కోపిక్​ ఫోర్క్స్​, రేర్​లో అడ్జెస్టెబుల్​ డ్యూయెల్​ షాక్​ అబ్సార్బర్స్​ వంటివి ఈ మోడల్లో ఉండే అవకాశం ఉంది.

రేటు ఎంతంటే..

హీరో ప్యాషన్ ప్లస్ మార్కెట్‌లో విక్రయాలపరంగా ఈ బైక్ హోండా షైన్ మరియు బజాజ్ ప్లాటినా వంటి వాటితో పోటీపడుతోంది. . కొత్త హీరో ప్యాషన్ ప్లస్ బైక్ ధర ఎక్స్‌ షోరూమ్‌లో రూ.76,065 గా ఉంది.