ప్రభాస్ విష్ చేయడం హ్యాపీ : ధర్మ

ప్రభాస్ విష్ చేయడం హ్యాపీ : ధర్మ

ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా కిరణ్ తిరుమలశెట్టి తెరకెక్కించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’.  బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. ఈ నెల 27న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.  హీరో ధర్మ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా టీజర్, ట్రైలర్‌‌‌‌ నచ్చితే తప్పకుండా థియేటర్స్‌‌కు రండి.  నేను ప్రభాస్ గారికి పెద్ద అభిమానిని. ఆయన్ని కలిశాను.  

సినిమా సక్సెస్ కావాలని ఆయన బెస్ట్ విషెస్ చెప్పారు.  అలా విష్ చేయడం సంతోషాన్ని ఇచ్చింది’ అని చెప్పాడు.  ‘సినిమాలోని ఎమోషన్, ఫన్  అందరికీ నచ్చుతుంది’ అని ఐశ్వర్య శర్మ చెప్పింది. డైరెక్టర్ కిరణ్ మాట్లాడుతూ ‘ఓ కథను నమ్మి నిజాయితీగా తెరకెక్కించాం. ఫస్ట్‌‌ హాఫ్‌‌ చాలా ఫన్‌గా ఉంటుంది. సెకెండాఫ్‌‌లో 40 నిమిషాలు అలా చూస్తుండిపోతారు. క్లైమాక్స్‌‌లో అంత డెప్త్ ఉంటుంది.  

సినిమా నచ్చితే పదిమందికి చెప్పండి, నచ్చకుంటే వందమందికి చెప్పండి’ అని చెప్పాడు.  అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న సినిమా ఇదని నిర్మాత ఇస్మాయిల్ షేక్ చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవసంత్, కొరియోగ్రాఫర్ మోయిన్,  డీవోపీ ప్రశాంత్ అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.