టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) ప్రభాస్ (Prabhas) ది రాజాసాబ్ (The RajaSaab) మూవీకు సంబంధించిన సర్‌ప్రైజ్ వచ్చేసింది. స్పెషల్ వీడియోతో మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. హ్యూమర్ టచ్తో తనదైన కామెడీ సినిమాలు తీసే మారుతి స్టైలిష్ మేకింగ్పై భారీ అంచనాలున్నాయి.
ఈ నేపథ్యంలో రిలీజ్ చేసిన పోస్టర్లో ప్రభాస్ చాలా కొత్తగా డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తున్నాడు. ప్రభాస్ సింహానం మీద రాజు లుక్‌లో కనిపించి అభిమానుల్లో జోష్ నింపారు. హారర్, కామెడీ నేపథ్యంతో వస్తోన్న రాజాసాబ్ కొత్త అవతారం ప్రభాస్ ఫ్యాన్స్కి కిక్ ఇస్తోంది.
ALSO READ | HBDPrabhas: ఆరడుగుల ఎత్తు.. గంభీరమైన స్వరం.. కండలు తిరిగిన దేహం..రాజంటే ఇలా ఉండాలి అనేలా
ఈ మేరకు డైరెక్టర్ మారుతి డార్లింగ్ ప్రభాస్కు బర్త్డే విషెష్ చెబుతూ.." నా రాజా సాబ్ ప్రభాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.. డార్లింగ్ నేను ఇప్పుడు పెద్దగా ఏం చెప్పలేను.....కానీ ఏప్రిల్ 10న మనం ఈ క్షణాన్ని అతి పెద్ద వేడుకగా మారుస్తాము" అంటూ ట్వీట్ చేసారు.
Been counting down the days for this one :)
— Director Maruthi (@DirectorMaruthi) October 23, 2024
Happy Birthday to my Raja Saab #Prabhas ❤️
Darling I might not say much now…..but April 10th will be the day we CROWN THIS MOMENT with the BIGGEST CELEBRATION :) 🤗
Motion poster :https://t.co/FNXdwIJwQ9#HappyBirthdayPrabhas… pic.twitter.com/qpn18SOFVI
ఇటీవల ప్రభాస్ లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేయగా అది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరలైంది. అందులో ప్రభాస్ గళ్ల చొక్కా, కళ్లద్దాలు పెట్టుకుని స్టైల్‌గా నడుస్తూ కనిపించారు. ఆ అంచనాలకు తగ్గట్లే తాజాగా విడుదలైన వీడియో ఆకట్టుకుంటోంది.
Isn't this what we all manifested? 😭🔥
— The RajaSaab (@rajasaabmovie) October 21, 2024
For Banners, Cutouts and Hoardings!https://t.co/wcykRB55Gy#Prabhas #TheRajaSaab pic.twitter.com/o5NMiWavII
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ మరియు రిద్ధి కుమార్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. కాగా ఈ మూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 2025 ఏప్రిల్ 10న సినిమాను విడుదల చేయనున్నారు.