Priyadarshi: తన భార్యకి బంగారం కొనేందుకు పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తానంటున్న హీరో ప్రియదర్శి...

Priyadarshi: తన భార్యకి బంగారం కొనేందుకు పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తానంటున్న హీరో ప్రియదర్శి...

టాలీవుడ్ యంగ్ హీరో, కమెడియన్ ప్రియదర్శి ఈ మధ్య విభిన్న కథనాలు ఎంచుకుంటూ ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. ఇటీవలే ప్రియదర్శి నటించిన "కోర్ట్: స్టేట్ వర్సెస్ నో బడీ" సినిమా సూపర్ హిట్ అయ్యింది. పోక్సో చట్టం గురించి అవగాహన కల్పిస్తూ తీసిన ఈ సినిమాని ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యారు. అయితే హీరో ప్రియదర్శి కెరీర్ లో సెటిల్ అవ్వడానికి పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తానంటూ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఇదేంటబ్బా.. ప్రియదర్శి ఏంటీ  పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చెయ్యడమేంటీ అంటూ ఆలోచిస్తూ తల పట్టుకుంటున్నారు.

అయితే అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం ప్రియదర్శి ప్రస్తుతం "సారంగపాణి జాతకం" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ పికిల్స్ ఆ ఆడియో లీక్ ని బేస్ చేసుకుని ఫన్నీ రీల్ చేశాడు. ఈ రీల్ లో హీరోయిన్ రూప కొడువాయూర్ ఈ డ్రెస్ నాకు నచ్చింది కొనివ్వమని హీరో ప్రియదర్శి ని అడుగుతుంది.. 

అయితే ప్రియదర్శి డ్రెస్ బాగుందని కానీ రేట్ ఎక్కువుందని షాక్ అవుతూ చెబుతాడు. దీంతో రూప ఏకంగా ఫస్ట్ నువ్వు కెరీర్ మీద ఫోకస్ చెయ్యాలి.. ముష్టి డ్రెస్ నే కొనలేకపోతున్నావు ఇంక ఫ్యూచర్ లో వచ్చే నీ వైఫ్ కి బంగారం గాజులు ఎలా కొంటావు అంటూ చెబుతుంది.. చివరికి ప్రియదర్శి నేను కెరీర్ మీద ఫోకస్ చేస్తాను.. అలాగే పచ్చళ్ళ బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తానంటూ ఇన్నోసెంట్ గా చెబుతాడు.. ప్రియదర్శి పికిల్స్ బిజినెస్ వెనుక ఉన్న స్టోరీ ఇది.. దీంతో నెటిజన్లు ఈ రీల్ ని చూసి ఫన్నీగా నవ్వుకుంటున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా "సారంగపాణి జాతకం" సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి సీనియర్ దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించాడు. పుష్ప మూవీ ఫేమ్ కల్పలత, తనికెళ్ల భరణి, రూప లక్ష్మి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ అవసరాల, వైవా హర్ష తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరో ప్రియదర్శి జాతకాలు పిచ్చి ఉన్న యువకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే సారంగపాణి జాతకం ట్రైలర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.