కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి టాలెంట్ ప్రూవ్ చేసుకుని ఫుల్ టైం హీరోగా దూసుకుపోతున్నాడు ప్రముఖ హీరో ప్రియదర్శి. ఇటీవలే ప్రియదర్శి హీరోగా నటించిన డార్లింగ్, 35 చిన్న కథాకాదు తదితర సినిమాలు ఆడియన్స్ ని బాగానే అలరించాయి. దీంతో హీరో ప్రియదర్శి ఈరోజు (ఆదివారం 19) మరో కొత్త సినిమాని ప్రకటించాడు. ఈ సినిమాకి "ప్రేమంటే..? థ్రిల్-యు ప్రాప్తిరస్తు" అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలిపాడు.
Also Read :- గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అంటూ నోరు జారిన ఊర్వశి..
ఈ సినిమాకి నూతన దర్శకుడు నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియదర్శి కి జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ కాయల్ ఆనంది నటిస్తుండగా ఫేమస్ యాంకర్ సుమ కనకాల కీలకపాత్రలో నటిస్తోంది. ఈ విషయాన్ని ప్రియదర్శి సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి తెలిపాడు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తుండగా SVCLLP బ్యానర్ పై టాలీవుడ్ ప్రముఖ హీరో, సినీ ప్రొడ్యూసర్ రానా దగ్గుబాటి సమర్పణలో ప్రముఖ సినీ నిర్మాతలు ఝాన్వినారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుంది.
ఈ మధ్య ప్రియదర్శి నటించిన సినిమాలు, వెబ్ సీరీస్లు, ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటున్నాయి. అంతేగాకుండా థియేటర్స్, ఓటిటిలో కూడా బాగానే వర్కౌట్ అవుతున్నాయి. దీంతో సరైన స్క్రిప్ట్ ఉంటె చాలు నిర్మాతలు బడ్జెట్ పెట్టడానికి రెడీ అంటున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రియదర్శి హీరోగా నటిస్తున్న సారంగపాణి జాతకం సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించాడు. ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.