Purushothamudu Review: పురుషోత్తముడు మూవీ రివ్యూ.. రాజ్‌తరుణ్‌ సినిమా ఎలా ఉందంటే?

Purushothamudu Review: పురుషోత్తముడు మూవీ రివ్యూ.. రాజ్‌తరుణ్‌ సినిమా ఎలా ఉందంటే?

టాలీవుడ్ యువ న‌టుడు రాజ్ త‌రుణ్ (Raj Tarun) ఈ మధ్య తన సినిమాల కంటే..ఆయన పేరే ఎక్కువ మోగుతుంది. ఒకవైపు మాజీ ప్రేయసి లావ‌ణ్య వివాదం న‌డుస్తుంటే..మ‌రోవైపు త‌న సినిమాల‌ను వరుసబెట్టి పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన పురుషోత్తముడు (Purushottamudu) మూవీ శుక్రవారం జూలై 26న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది?టీజర్, ట్రైలర్ లో చూపించిన శ్రీమంతుడు, మహర్షి మాదిరిగా ఉందా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

కథేంటంటే?

రచిత రామ్‌ (రాజ్‌ తరుణ్‌) పుట్టుకతోనే కోటీశ్వరుడు. అతను భారత్‌లోని గొప్ప బిజినెస్ మెన్స్ లో ఒకరైన పీఆర్‌ గ్రూప్స్‌ అధినేత ఆదిత్య రామ్‌ (మురళీ శర్మ) తనయుడు. రచిత రామ్ లండన్‌లో చదువు పూర్తి చేసుకుని స్వదేశానికి (ఇండియాకు) తిరిగి వస్తాడు. రామ్ వచ్చి రరాగానే  పీఆర్ గ్రూప్స్ కి అధినేతను చేయాలనీ తండ్రి ఆదిత్య రామ్ డిసైడ్ అవుతాడు.అయితే, తన ఫ్యామిలీ నుంచి ఎవ్వరు సీఈఓ కావాలన్నా అందుకు కంపెనీ నిబంధనలు ఉంటాయని రామ్ పెద్దమ్మ (రమ్య కృష్ణ) అందరికీ గుర్తు చేస్తుంది. సీఈవో కావాలంటే ముందు ఆ వ్యక్తి వంద రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లి అక్కడి స్థితిగతులు తెలుసుకోవాలని చెబుతుంది.ఇక ఆ కంపెనీలో తనకు 50 శాతం వాటా ఉండటంతో రామ్‌ అజ్ఞాతంలోకి వెళ్లక తప్పదు. దీంతో రచిత్‌ రామ్ తనని తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకొచ్చేస్తాడు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని కడియం సమీపంలో ఉన్న రాయపులంక అనే పల్లెటూరికి చేరుకుంటాడు.

ALSO READ | KA Pre Release Business: “క” మూవీకి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్!..దుమ్ములేపుతోన్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం మిస్ట‌రీ థ్రిల్ల‌ర్

అక్కడే ఆ గ్రామంలో నర్సరీ నడుపుతున్న అమ్ములు (హాసిని సుధీర్‌) దగ్గర పనిలో చేరతాడు. ఆ గ్రామంలోని రైతుల్ని పలు విధాలుగా  స్థానిక ఎమ్మెల్యే, అతని కుమారుడు చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. వ్యవసాయం చేసుకుని బతికే భూమి దగ్గరి నుంచి బతికే జీవన విధానం వరకు సమస్యలకు గురి చేస్తుంటారు. దీంతో అక్కడి రైతులు రామ్‌ సాయం కోరతారు. రాయపులంకకి వెళ్లాక రచిత్‌ రామ్‌ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? ఓ సామాన్య రైతు కూలీగా స్టార్ట్ చేసిన కొత్త జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి?  ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు రచిత్ రామ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? రచిత్‌కు.. అమ్ము (హాసినీ సుధీర్‌)కు మధ్య చిగురించిన ప్రేమలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో సినిమా థియేటర్లో చూసి తెలుసుకోవాల్సిందే. 

ఎలా ఉందంటే?

ఒక హీరో తనకోసం కాకుండా ప్రజల కోసం ఉన్న ఆస్థి మొత్తం వదిలేసి సాధారణ గడిపే జీవితాలను చాలా సినిమాల్లో ఇదివరకే చూశాం.  ఈ క్రమంలో ఓ పల్లెటూరికి వచ్చి అక్కడ ప్రజల సమస్యల్ని తెలుసుకుని..ఎంత కష్టమైనా వాటిని పరిష్కరించి ఆ ఊరికి దేవుడిగా మారడం వెండితెరకేం కొత్త కాదు. ఈ పాయింట్‌తో శ్రీమంతుడు, బిచ్చగాడు, పిల్ల జమీందార్‌.. లాంటి సినిమాలు ఇదివరకే తెలుగులో  వచ్చాయి. డైరెక్టర్ రామ్‌ భీమన ఎంచుకున్న పాయింట్‌ కూడా ఇదే! అయితే, పురోషోత్తముడు కథ పాతదే అయినా తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. కానీ, సినిమా చూస్తున్నంతసేపు ఇదివరకే చూసిన సినిమాల నేపథ్యం గుర్తుకురావడం వంటివి ఆడియన్స్ కు కాస్తా ఇబ్బందికి గురిచేస్తాయి.

ALSO READ | Raayan: ధనుష్ రాయన్ మూవీ పెద్దలకు మాత్రమే.. పిల్లలకు నో ఎంట్రీ సెన్సార్ సర్టిఫికెట్

దర్శకుడు రాసిన కథలోనూ.. తెరపై ఆవిష్కరించడంలోనూ కొత్తదనం కనిపించదనే ఫీలింగ్ కలుగుతుంది. ఇది ఓ కోణంలో చూస్తే ‘శ్రీమంతుడు’ సినిమాకి పాత వెర్షన్‌లా..ఇంకో కోణంలో ‘బిచ్చగాడు’కు అప్‌డేట్‌ వెర్షన్‌లా  ఉంటుంది. ఫస్టాఫ్‌ మాత్రం హీరో-హీరోయిన్‌ పరిచయం, ప్రేమ వంటి సీన్స్ తో ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది.  ఎప్పుడైతే హీరో రాయపులంక ఊరికి వచ్చాక పూల రైతులకు ఎదురయ్యే అన్యాయాలపై తిరగబడేందుకు సిద్ధపడతాడో.. అక్కడి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. ఇక ఈ సమయంలో వచ్చే ఇంట్రెవెల్ సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. సెకండాఫ్‌ లో మాత్రం కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. కథలో సహజ సిద్ధమైన బలమైన సంఘర్షణ ఎక్కడ కనిపించదు. ఇక విలన్ క్యారెక్టర్ ని ఇంకాస్తా శక్తిమంతంగా డిజైన్ చేస్తే బాగుండేది. ఇక ఈ పురోషత్తముడికి పెద్దగా ట్విస్టుల్లేకుండా ఉండటం ఆడియన్స్ కి నిరాశ కలిగిస్తోంది. 

ఎవరెలా చేశారంటే?

రచిత్‌ రామ్‌ క్యారెక్టర్ లో రాజ్‌తరుణ్‌ చక్కగా ఒదిగిపోయాడు. తన పాత్రలోని ఎమోషన్స్ కి తగిన న్యాయం చేశాడు. యాక్షన్ సీన్స్ లో స్టార్ హీరో మాదిరి కనిపిస్తాడు. హీరోయిన్‌ హాసిని సుధీర్‌ తనదైన నటనతో, అందంతో మెప్పించింది. అమ్ము పాత్రలో పల్లెటూరి అమ్మాయిలా కనిపించి ఆకట్టుకుంది. రమ్యకృష్ణ ఎప్పటిలాగే తనలోని సిగ్నేచర్ యాక్టింగ్ తో హుందాగా నటించింది. ప్రకాశ్‌ రాజ్‌, విరాన్‌ ముత్తం శెట్టి, మురళీ శర్మ.. తమ పాత్రల్లో లీనమైపోయారు. కమెడియన్స్ సత్య, బ్రహ్మానందం తళుక్కున మెరిసినా, ప్రవీణ్‌ పాత్రే సినిమాలో కొన్నైనా నవ్వులు పంచుతుంది.