Raj Tarun: రాజ్‌తరుణ్‌ హీరోగా పాన్‌ ఇండియా మూవీ.. ఆసక్తిగా 'రామ్ భజరంగ్' ఫస్ట్ లుక్

Raj Tarun: రాజ్‌తరుణ్‌ హీరోగా పాన్‌ ఇండియా మూవీ.. ఆసక్తిగా 'రామ్ భజరంగ్' ఫస్ట్ లుక్

రాజ్ తరుణ్ , సందీప్ మాధవ్ హీరోలుగా 1980 బ్యాక్ డ్రాప్‌‌లో సి.హెచ్.సుధీర్ రాజు తెరకెక్కిస్తున్న చిత్రం ‘రామ్ భజరంగ్’(Ram Bhajarang). స్వాతి సుధీర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. దసరా సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు.ఇద్దరు హీరోలు డిఫరెంట్ గెటప్స్‌‌లో కనిపిస్తున్నారు.

‘గదర్ 2’ హీరోయిన్ సిమ్రత్ కౌర్, ‘బిచ్చగాడు’ ఫేమ్ సట్న టీటస్, ఛాయా దేవి, మానసా రాధాకృష్ణన్ హీరోయిన్స్‌‌గా నటిస్తున్నారు.  రాజా రవీంద్ర, రవి శంకర్, షఫీ, సత్యం రాజేష్ ఇతర  పాత్రలు పోషిస్తున్నారు.  మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 

1980 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఐదు భాషల్లో (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ) ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలియజేశారు.