పవన్ సాధినేని డైరెక్షన్ లో రాజశేఖర్


హీరో రాజశేఖర్ మరో యాక్షన్  ఎంటర్‌టైన్‌మెంట్  మూవీ చేసేందుకు రెడీ అయిపోయారు. పవన్ సాధినేని డైరెక్షన్ లో  రాజశేఖర్ ఈ కొత్త మూవీని చేస్తున్నారు.  సోమవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.ఈ సినిమాకు 'మాన్‌స్టర్‌'  అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మేరకు దర్శకుడు  పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. విడుదల చేసిన పోస్టర్‌ లో  'Monster' అక్షరాలను హైలైట్ చేశారు.

సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకం పై   మల్కాపురం శివ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఇది రాజశేఖర్ కు 92వ  సినిమా కాగా, దీనికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.  ఇందులో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.