టాలీవుడ్ సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంటున్నాడు. గతంలో ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పుష్ప 2 సినిమాలోని అల్లు అర్జున్ ని ఉద్దేశిస్తూ వాడెవడో ఎర్రచందనం దుంగల దొంగ స్మగ్లర్ వాడు హీరో అంటూ కామెంట్లు చేశాడు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఇందులోభాగంగా అల్లు అర్జున్ పై కామెంట్లు చేసింది వాస్తవమే కానీ తన ఉద్దేశం వేరే ఉందని తెలిపాడు. ఒక్కోసారి తానె తన సినిమాలోని పాత్రలపై కామెంట్లు చేసుకుంటూ ఉంటాననని అన్నాడు.
ALSO READ | మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలపై మరో కేసు నమోదు..
ఎందుకంటే తాను ఎక్కువగా నటించిన సినిమాల్లో హీరోపాత్రలు నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయని అందుకే ప్రజలు తనని ఇంతగా ఆదరించారని చెప్పుకొచ్చాడు. ఇక అల్లు అర్జున్ ని కలసినప్పుడు ఈ విషయం గురించి మాట్లాడుకున్నామని కానీ కొందరు వ్యూస్ కోసం తాను మాట్లాడిన మాటలని వక్రీకరించారని అయినప్పటికీ తనకేం కోపం లేదని తెలిపాడు.
ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది కల్కీ 2898AD, జనక అయితే గనక, లగ్గం, ఉత్సవం తదితర సినిమాల్లో నటించి ఆడియన్స్ ని అలరించాడు. ప్రస్తుతం మరిన్ని సినిమాల్లో నటిస్తున్నాడు.