మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరో రామ్ చరణ్

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరో రామ్ చరణ్

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ ఏకమవుతుంది. ఇప్పటికే ప్రముఖ తెలుగు హీరోలు స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా హీరో రామ్ చరణ్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.

"మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమైనవి, నిరాధారమైనవి. ప్రజలచే ఎన్నుకోబడిన నాయకురాలిగా సినీ ఇండస్ట్రీలో గౌరవనీయమైన వ్యక్తుల గురించి అసభ్యకరమైన బహిరంగ వ్యాఖ్యలు చేయడం దిగ్భ్రాంతికరం అని చరణ్ అన్నారు.

ALSO READ | SWAG Twitter X Review: శ్రీ విష్ణు 'స్వాగ్' ట్విట్టర్ X రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

ఈ రకమైన అపవాదు మన సమాజపు మూలాధారాలను నాశనం చేస్తాయ‌ని.. సినీ రంగ‌మంతా కలిసికట్టుగా ఉంద‌ని మమ్మల్ని ఉద్దేశించి చేసిన ఇలాంటి నిర్లక్ష్యపు వ్యాఖ్య‌ల‌ను సహించమ‌న్నారు. మనం ప‌బ్లిక్ ఫిగ‌ర్స్ మన వ్యక్తిగత జీవితాలు ఎంతో విలువైన‌వ‌ని, గౌర‌వ మ‌ర్యాద‌లు ఉన్న‌వారిమని అంతా క‌లిసిక‌ట్టుగా ఉండాల‌ని అవ‌త‌లి వారిపై విమ‌ర్శ‌లు చేసుకోకూడ‌ద‌ని, ప్ర‌జ‌లకు ఆద‌ర్శంగా ఉండాలంటూ" రామ్ చ‌ర‌ణ్ త‌న పోస్టులో వ్రాసుకొచ్చారు.